#కాజల్ 60... పుట్టినరోజు సందర్భంగా టైటిల్ రిలీజ్

#కాజల్ 60... పుట్టినరోజు  సందర్భంగా టైటిల్ రిలీజ్
60వ సినిమాలో కాజల్ కొత్త లుక్

పెళ్ళైన తరువాత కూడా మిగతా హీరోయిన్లతో సమానంగా దూసుకుపోతున్న హీరోయిన్ కాజల్ ఇప్పుడు మరొక సినిమా తో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. తన 60 వ చిత్రంలో ఆమె ఒక పవర్ ఫుల్ పాత్రలో వెండి తెరపై కనిపించబోతోంది.తాజాగా జూన్ 19 న కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రి లుక్ విడుదల చేశారు. తెలుగు తెర అందాల చందమామ కాజల్‌ వివాహం తరువాత కూడా వరుసగా అవకాశాలను దక్కించుకుంటోంది. తెలుగులో బాలయ్యకి జోడీగా భగవంత్‌ కేసరి లోను తమిళంలో కమలహాసన్ ఇండియన్‌ 2 చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా మరో కొత్త సినిమాకి సైన్‌ చేసింది. ఇక #కాజల్ 60 విషయానికి వస్తే ఔరమ్ రమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేజర్, గూడచారి సినిమాల దర్శకుడు శశి కిరణ్ తిక్క ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రచించగా , ఉగ్రం, గూడచారి 2, సినిమాలకు మ్యూజిక్ చేసిన శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. అఖిల్ డేగల ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. ఇందులో కాజల్ మునుపెన్నడూ కనిపించని విధంగా కొత్తగా కనిపించబోతోంది. తాజాగా ఈ మూవీ ప్రీ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో రాత్రి వేళ కాజల్‌ కారులో డ్రైవింగ్‌ చేస్తూ వెళుతోంది . మిర్రర్‌లో షేడ్స్ పెట్టుకున్న ఆమె ఫేస్ కనిపిస్తోంది. గాజు గాజులు ఉన్న కుడి చెయ్యి డోర్ బయటకి పెట్టి ఉంది. అంటే ఈ మూవీ లో కాజల్ కాస్త బోల్డ్ గా కనిపించబోతున్నట్టు అనిపిస్తోంది. హీరో లేకుండా హీరోయిన్ పోస్టర్ ను విడుదల చేయడం, అది కుడా #కాజల్ 60 కాబట్టి ఇది ఫిమెల్ లీడ్ మూవీ కావచ్చు అని భావిస్తున్నారు.ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది కాజల్‌. చిన్ననాటి స్నేహితుడు, ప్రేమికుడు అయిన ముంబయికి చెందిన వ్యాపార వేత్త గౌతమ్‌ కిచ్లుని మూడేళ్ల క్రితం వివాహం చేసుకుంది. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. వివాహ తర్వాత కూడా కాజల్ లుక్ ఏమాత్రం మారలేదు మరింత అందంగా తెర మీదకు వచ్చింది. మళ్ళీ సినిమాలతో బిజీ అవుతోంది. అయితే కొద్ది రోజులుగా ఆమె రెండో సారి ప్రెగ్నెంట్ అయినట్టు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు కొత్త సినిమా అనౌన్స్ మెంట్‌ రావడంతో ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story