Kajal Agarwal: కోస్టిగా కాజల్ అగర్వాల్

Kajal Agarwal: కోస్టిగా కాజల్ అగర్వాల్
X
మరోసారి భయపెట్టేందుకు సిద్ధమవుతోన్న చందమామ

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తల్లి అయ్యాక కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ సినిమాలతో బిజీగా మారింది. అయితే ఈ సారి రొటీన్ కు భిన్నమైన కథలకు పెద్ద పీట వేస్తున్న కాజల్ తాజాగా కోష్టీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కల్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవ్వబోతోంది. వేసవి సెలవులు పురస్కరించుకుని మార్చ్ 22న చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సమాయత్తం అవుతోంది. ఈ హారర్ కామెడీలో కాజల్ ద్విపాత్రాభినయం చేస్తోంది. ఓ పాత్రలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గానూ, మరో పాత్రలో నాయకిగానూ కనువిందు చేయబోతోంది. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించారు. మరి కాజల్ డబుల్ థమాఖా ప్రేక్షకులను ఏ రీతిన మెప్పింస్తుందో చూడాలి.

Tags

Next Story