7 Dec 2020 10:27 AM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / ఆ హోటల్ రెంట్ రోజుకు...

ఆ హోటల్ రెంట్ రోజుకు రూ.38లక్షలు.. పదిరోజులున్నా పైసా కూడా పే చేయని కాజల్.. ఎందుకో తెలుసా

పెళ్లయిన తరువాత హనీమూన్‌కి అని ఈ కొత్త జంట మాల్దీవులకు చెక్కేశారు. ప్రపంచంలోనే మొట్టమొదట నీటి అడుగున

ఆ హోటల్ రెంట్ రోజుకు రూ.38లక్షలు.. పదిరోజులున్నా పైసా కూడా పే చేయని కాజల్.. ఎందుకో తెలుసా
X

సెలబ్రెటీలు సెకనుకి లక్ష అయినా పే చేయగలరు.. వారి సంపాదన కోట్లలో ఉంటే ఆ మాత్రం ఖర్చుపెట్టలేరా ఏంటి.. సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, షాపు ఓపెనింగులు వద్దంటే డబ్బు.. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా ఓ పోస్టో, ఓ ఫోటోనో పెట్టి ఫాలోవర్స్ సంఖ్యని పెంచుకుంటే డబ్బులు అకౌంట్‌లో అమాంతం వచ్చి పడుతుంటాయి. నటీనటులు పెళ్లి చేసుకుంటే సామాజిక మాధ్యమాలన్నీ అవే ముచ్చట్లు చెబుతుంటాయి. మెహందీ, సంగీత్, పెళ్లి తంతు, హానీ మూన్‌కి వెళ్లి ఇంటికి వచ్చిందాకా కెమెరా కళ్లు వారినే పరికిస్తుంటాయి.

ఈ మధ్య టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకోవడం అభిమానులను కొంత నిరాశ పరిచినా ఆమె చేసిన ప్రతి పోస్ట్‌ని, ప్రతి ఫోటోని ఎంజాయ్ చేశారు. పెళ్లయిన తరువాత హనీమూన్‌కి అని ఈ కొత్త జంట మాల్దీవులకు చెక్కేశారు. ప్రపంచంలోనే మొట్టమొదట నీటి అడుగున ఉన్న ది మురాకా హోటల్ అక్కడ ఉంది. అందులోనే ఈ జంట పది రోజులపాటు బస చేశారు. అక్కడ దిగిన ఫోటోలను అభిమానులకు షేర్ చేసింది కాజల్.

అయితే పర్యాటకులను అమితంగా ఆకర్షించే ఈ హోటల్‌లో బస చేయాలంటే ఒక్క రాత్రికి దాదాపు రూ.38 లక్షలు ఖర్చవుతాయట. కానీ పది రోజులున్నా పైసా కూడా చెల్లించలేదట కాజల్.. దాదాపు రూ.5 కోట్ల బిల్లుని అలా ఎలా వదిలేశారని ఆరా తీస్తే.. తమ పర్యాటక రంగాన్ని విదేశీయులకు ముఖ్యంగా భారతీయులకు చేరువచేయాలనే ఉద్దేశంతో మాల్దీవుల ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

అందులో భాగంగానే ఏ సెలబ్రెటీకైతే ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉంటారో వాళ్లు మాల్దీవులకు వచ్చినప్పుడు ఏ హోటల్‌లో బస చేస్తే అక్కడ ఫైవ్‌స్టార్ భోజనం ఉచితంగా అందిస్తారు. అదే అయిదు మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న సెలబ్రెటీలకైతే ఆ హోటల్‌లో రూమ్, ఫుడ్, రిటన్ టిక్కెట్లు అన్నీ ఫ్రీ.. ఇక కాజల్‌కి 16 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉంటే ఇంకెందుకు తీసుకుంటారు డబ్బులు.

ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండండి మేడమ్ అంటూ సాదరంగా స్వాగతం పలికి అతిధి సత్కారాలన్నీ దగ్గరుండి చూసుకున్నారు. అమ్మడికి పైసా ఖర్చు లేకుండా చేసిన అభిమానులు గ్రేట్. ఈ క్రెడిట్ అంతా వారిదే మరి. కాజల్ పెళ్లి చేసుకుందని తెలియగానే మురాకా హోటల్ యాజమాన్యమే ఆమెకు స్వయంగా ఫోన్ చేసి మా హోటల్ సందర్శించండి అంటూ ఫ్రీ ప్యాకేజ్ గురించి వివరించారట. మీరు మీ డ్రెస్‌లు, మీ మేకప్ కిట్ తెచ్చుకుంటే చాలు.. ఫుడ్డూ, బెడ్డూ అన్నీ మేం ఎరేంజే చేస్తామని అనేసరికి రెక్కలు కట్టుకుని వాలిపోయింది కొత్త జంట. అందుకేనేమో అక్కడి నుంచి తన హనీమూన్‌కి సంబంధించిన మరిన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అద్గదీ సంగతి.. సెలబ్రెటీ అయితే ఇలాంటివెన్నో ఫ్రీ ప్యాకేజీలు అందుతాయి.

Next Story