చందమామను చేసుకునే వరుడు అతడే..!!

చందమామను చేసుకునే వరుడు అతడే..!!
X
ముంబైలో వీరి వివాహం జరగనుందని సినీ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

టాలీవుడ్‌ అమ్మడు కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లి చేసుకోనుంది. ఈ చందమామకు కాబోయే వరుడు ఓ వ్యాపార వేత్తని తెలుస్తోంది. ముంబైకి చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌, వ్యాపారవేత్తను ఈ చందమామ‌ పెళ్లి చేసుకోనున్నట్లు టాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఆ వ్యాపారవేత్తతో ఈ అమ్మడు రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాజల్ సన్నిహితుడు, నటుడు బెల్లంకొండ శ్రీనివాస్.. నటి రహస్య నిశ్చితార్థ వేడుకకు హాజరైనట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా అమ్మడు చేసుకునే వరుడు పేరు కూడా బయటికి వచ్చేసింది.

ఇంటీరియర్‌ డిజైనర్‌, వ్యాపారవేత్త అయిన గౌతమ్‌ కిచ్లుని కాజల్‌ వివాహం చేసుకోనుందని టాలీవుడ్ టాక్. ముంబైలో వీరి వివాహం జరగనుందని సినీ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాజల్ తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా త్వరలో అధికారిక ప్రకటన చేస్తారని కూడా చెబుతున్నారు. కాగా, తాను 2020 లో పెళ్లి చేసుకుని స్థిరపడాలని అనుకున్నట్లు ఓ షోలో తెలిపారు కాజల్. తనను చేసుకోబోయే వ్యక్తి ఆదర్శ భావాలు ఉన్నవాడు, ఆధ్యాత్మిక భావాలు ఉన్న వాడు అయి ఉండాలని కూడా తెలిపారు.

కాగా లక్ష్మీ కళ్యాణంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఇప్పటివరకు తెలుగు, తమిళ్‌, హిందీలో దాదాపుగా 60 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పలు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అందులో చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2లు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. వీటితో పాటు విష్ణు మోసగాళ్లు, జాన్ అబ్రహాం ముంబయి సగ, దుల్కర్ సల్మాన్‌ హే సినామిక చిత్రాల్లోనూ ఆమె నటిస్తున్నారు.

Tags

Next Story