భగవంత్ కేసరి... అదిరిన ఫస్ట్ లుక్

టాలీవుడ్ అందాల చందమాల కాజల్ అగర్వాల్ 38వ పడిలోకి అడుగుపెడుతోన్న సందర్భంగా ఆమె నటిస్తోన్న 60వ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. భగవంత్ కేసరి ఫస్ట్ లుక్ లో కాజల్ విభిన్నంగా కనిపిస్తోందని చెప్పాల్సిందే. తల్లి అయ్యాక మరింత అందాన్ని ఇనుమడింపజేసుకున్న చందమామ మరింత అందంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కళ్లద్దాలు పెట్టుకుని పుస్తకం చేతబట్టుకున్న ఆమె మరింత హుందాగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ కాజల్ చేయని విభిన్నమైన పాత్ర ఇది కాబోతోందని అర్ధమవుతూనే ఉంది. ఇక బాలయ్యతో అమ్మడు జోడీ కట్టడం కూడా ఇది తొలిసారి కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శ్రీలీల మరో హీరోయిన్ గా కనిపించబోతోంది. బాలీవుడ్ స్టార్ అర్జున్ రామ్ పాల్ భగవంత్ కేసరిలో కీలక పాత్ర పోషించబోతున్నారు. మరి ఇంత మంచి స్టార్ క్యాస్ట్ తో మురిపిస్తున్న భగవంత్ కేసరి బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తాడో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com