Actress Meena: తన భర్తను కాపాడుకోవడానికి మీనా ఎంతో ప్రయత్నించింది: కళా మాస్టర్

Actress Meena: సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్ మరణం అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. బుధవారం ఆయన అకాల మరణం తర్వాత.. విద్యాసాగర్ మృతికి ఇదే కారణమంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా దీనిపై మీనా స్నేహితురాలు, సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ స్పందించారు. జనవరి నుండి విద్యాసాగర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె వివరించారు.
కొవిడ్ బారిన పడకముందు విద్యాసాగర్‌కు బర్డ్ ఇన్‌ఫెక్షన్ అయిందని డాక్టర్లు చెప్పారని బయటపెట్టారు కళా మాస్టర్. ఈ విషయం అందరికీ ఆలస్యంగా తెలిసిందన్నారు. ఆ తర్వాత జనవరిలో విద్యాసాగర్ కోవిడ్ బారిన పడి, మళ్లీ కోలుకున్నారని తెలిపారు. మీనా తల్లి పుట్టినరోజు వేడుకలో కళా మాస్టర్.. విద్యాసాగర్‌ను కలిసినప్పుడు ఆయన బాగానే ఉన్నారని అన్నారు.
మార్చిలో మీనా ఫోన్ చేసి సాగర్ ఆరోగ్యం బాలేదని తనకు చెప్పారని అన్నారు కళా మాస్టర్. అప్పుడు ఆసుపత్రికి వెళ్లి పలకరించినప్పుడు కూడా ఆయన బాగానే ఉన్నారని తెలిపారు. ఆ తర్వాత ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకిందని, వెంటనే ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని వైద్యులు చెప్పారట. కానీ వారందరూ ఎంత ప్రయత్నించినా అవయవం లభించలేదట. రోజురోజుకీ ఆరోగ్యం క్షీణిస్తున్నా కూడా సాగర్ ఎంతో ధైర్యంగా ఉన్నారన్నారు కళా మాస్టర్. తన భర్తను కాపాడుకునేందుకు మీనా ఎంతో ప్రయత్నించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com