Kantara Row: ట్విట్టర్‌ సస్పెండ్‌; నటుడి కీలక స్టేట్మెంట్

Kantara Row: ట్విట్టర్‌ సస్పెండ్‌; నటుడి కీలక స్టేట్మెంట్
నా ట్విట్టర్‌ను హ్యాక్‌ చేశారు: కాంతారాపై పోస్ట్‌కు దీనికి సంబంధంలేదు; కిశోర్ క్లారిటీ


నాడు కశ్మీరీపండిట్లపై జరిగిన అరాచకాలు, నేడు ముస్లింలపై జరుగుతున్న దాడులను ఒకేలా చూడాలంటూ హీరోయిన్ సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ కిశోర్ పెట్టిన సోషల్ మీడియా పోస్టు దక్షిణాదిన పెద్ద దుమారాన్నే లేపింది. నటిమణులు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండటం కూడా తప్పేనా అంటూ వ్యాఖ్యానించిన కిశోర్ పైన రైట్ వింగ్ యాక్టివిస్ట్ లు గుర్రుగా ఉన్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ అకౌంట్ నిలిచిపోవడం ఇందులో భాగమేనని నెటిజెన్లు భావిస్తున్నారు. దీనిపై కొందరు హిందూ కార్యకర్తలు సంబరాలు చేసుకోగా, మరి కొందరు మాత్రం ఆయనకు మద్దతు తెలిపారు.


అయితే ట్విట్టర్ ఖాతా సస్పెన్షన్‌కి, తన వివాదాస్పద పోస్ట్‌కి ఎలాంటి సంబంధం లేదని నటుడు కిషోర్ స్పష్టం చేశారు. తాను సాధారణంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే తన అభిప్రాయాలను పంచుకుంటానని, ట్విట్టర్‌ ఖాతాను చాలా అరుదుగా వాడుతానని చెప్పారు. తన ఖాతా సస్పెండ్ అయినట్లు వేరే సామాజిక మాధ్యమం ద్వారా తెలిసిందని వెల్లడించారు. డిసెంబర్‌ 20న ట్విట్టర్‌ ఖాతా సస్పెండ్‌ అయినట్లు తెలిపారు. తన ట్విట్టర్‌ ఖాతాను హ్యాకర్లు హ్యాక్‌ చేసుంటారని, తన ఖాతా నుంచి ఏమైనా పోస్ట్‌ చేశారా అని కూడా తనకు తెలియదని ఆయన స్పష్గం చేశారు.



Tags

Read MoreRead Less
Next Story