Karan Johar: 'విరాటపర్వం' ట్రైలర్‌పై కరణ్ జోహార్ ట్వీట్.. సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా..

Karan Johar: రానా, సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే ‘విరాటపర్వం’.

Karan Johar: విరాటపర్వం ట్రైలర్‌పై కరణ్ జోహార్ ట్వీట్.. సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా..
X

Karan Johar: ప్రస్తుతం బాలీవుడ్ మేకర్స్ అంతా.. సౌత్ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఏదైనా కథ నచ్చితే.. వెంటనే రీమేక్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. ఇక అప్‌కమింగ్ తెలుగు సినిమాల రిలీజ్‌పై బాలీవుడ్ ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తోంది. అందుకే రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న విరాటపర్వం ట్రైలర్ విడుదలవ్వగానే కరణ్ జోహార్ దీనిపై ట్వీట్ చేశాడు.

రానా, సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే 'విరాటపర్వం'. రెండేళ్లుగా ఈ సినిమా పూర్తి చేయడానికి కష్టపడుతున్న మూవీ టీమ్.. ఇన్నాళ్లకు రిలీజ్ డేట్‌ను ఫైనల్ చేసింది. ఎన్నోసార్లు వాయిదా పడిన తర్వాత జూన్ 17న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల విరాటపర్వం ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.

విరాటపర్వం ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది. యుద్ధం మధ్యలో ప్రేమకథ అనే కాన్సెప్ట్ కట్టిపడేసేలా అనిపిస్తోంది. అయితే ఈ ట్రైలర్‌పై కరణ్ జోహార్ స్పందించాడు. 'ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది రానా. సినిమాను చూడడానికి ఎదురుచూస్తున్నాను. నువ్వు సూపర్. ఇంక నేను పెద్ద సాయి పల్లవి ఫ్యాన్' అని సాయి పల్లవిపై తనకు ఉన్న అభిమానాన్ని బయటపెట్టాడు కరణ్ జోహార్.


Next Story