Karthikeya 2 Trailer: 'కార్తికేయ 2' ట్రైలర్ రిలీజ్.. ఇది ద్వారకా కృష్ణుడి కథ..

Karthikeya 2 Trailer: మూడేళ్లుగా తెరపై కనిపించలేదు యంగ్ హీరో నిఖిల్. ఇక తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన 'కార్తికేయ' చిత్రానికి సీక్వెల్‌తో ఇన్నాళ్లకు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. తన స్నేహితుడు చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో ప్రారంభించుకున్నా కూడా పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలయ్యింది.
'కార్తికేయ 2' మొదలయినప్పటి నుండి ఎన్నో సమస్యలు ఎదుర్కుంటూనే ఉంది. మొదట కోవిడ్ కారణంగా షూటింగ్ మెల్లగా జరుగుతూ వచ్చింది. ఇక షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఒక విడుదల తేదీని దక్కించుకోవడానికి మూవీ టీమ్ ఎంతో కష్టపడింది. ఆగస్ట్ 12న సినిమా విడుదల ఖరారు చేసిన తర్వాత కూడా ఒకరోజు వాయిదా వేసుకొని ఆగస్ట్ 13న మూవీ విడుదల ఖరారు చేసుకుంది.
కార్తికేయ 2లో నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండగా అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ట్రైలర్ చూస్తే ఈ సినిమా అంతా ద్వారకా నగరంలో జరుగుతుందన్న విషయం అర్థమయ్యింది. గ్రాఫిక్స్ విషయంలో కూడా మూవీ హై క్వాలిటీ మెయింటేయిన్ చేసింది. డైలాగ్స్, విజువల్స్ అన్నీ కలిపి కార్తికేయ 2పై మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com