ఎప్పటికైనా అలాంటి సినిమా తీయాలనుకున్నా కత్తి మహేష్... కానీ అంతలోనే ఇలా..!

ఎప్పటికైనా అలాంటి సినిమా తీయాలనుకున్నా కత్తి మహేష్... కానీ అంతలోనే ఇలా..!
X
నెల్లూరు వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహేష్.. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

సినీ నటుడు, దర్శకుడు, సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ నిన్న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. నెల్లూరు వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహేష్.. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అసలు కత్తి మహేష్ సినిమాల్లోకి ఎలా వచ్చారు. ఆయన నేపధ్యం ఏంటో ఒక్కసారి చూద్దాం.

కత్తి మహేశ్‌ చిత్తూరు జిల్లా వాసి. పీలేరులో పుట్టి పెరిగారు. ఆయనకి ఒక్క ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు. ఆయన తండ్రి వ్యవసాయ శాఖాలో అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. మైసూర్‌ రీజినల్‌ కాలేజ్‌లో ఇంగ్లీష్ లిటరేచర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ పూర్తి చేసిన మహేష్... ఆ తర్వాత హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో మాస్‌ కమ్యూనికేషన్‌ చదివారు. చిన్నప్పటి నుంచి సినిమాల పైన చాలా ఆసక్తి ఉండేదట. ఓ సినిమా బాలేదని ఎవరైనా అంటే అసలు ఎందుకు బాలేదో చూసి ఆయన విశ్లేషణ చేసుకునేవారట. వేసవి సెలవుల్లో అయితే వీపరితంగా సినిమాలను చూసేవారట.

సినిమాలపై ఆసక్తితో ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్రరావు ప్రొడక్షన్‌ హౌస్‌లో 'రాఘవేంద్ర మహత్య్మం' సీరియల్‌కు పనిచేశారు. ఇక కత్తి మహేశ్‌ది ప్రేమ వివాహం కావడం విశేషం. ఆయన భార్య బెంగాలీ. ఇద్దరు గతంలో యూనిసెఫ్‌కు పనిచేస్తున్న సమయంలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు తీసుకువచ్చింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. కత్తి మహేష్ కి బిగ్‌‌బాస్ సీజన్ 1 లో అనుకోకుండా ఛాన్స్ వచ్చిందట.. తానూ ఇంత ఫేమస్ అవ్వడానికి బిగ్‌‌బాస్ కారణమని ఆయన ఓ సందర్భంలో వెల్లడించారు. బిగ్‌‌బాస్ హౌస్ లో ఓ వారం కూడా ఉంటానో లేదో అనుకున్నాను కానీ , నాలుగు వారాలు ఉన్నానని దానికి తానూ చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యానని మహేష్ వెల్లడించారు.

ఆ సమయంలో ఎన్టీఆర్ తనకి చాలా ప్రోత్సాహన్నీ ఇచ్చారని తెలిపారు. ఇక తానూ ఎప్పుడు కూడా నటుడిని అవుతానని అనుకోలేదని, సాయి రాజేష్ తనకి స్నేహితుడు కావడంతో హృదయ కాలేయం సినిమాలో అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు. కత్తి మహేష్ పెసరట్టు అనే సినిమాకి దర్శకత్వం వహించారు. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. అయితే ఎప్పటికైనా మంచి సందేశాత్మక చిత్రం తీయాలని కత్తి మహేశ్‌ అనుకునేవారు. కానీ రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడంతో ఆ కల కలగానే మిగిలిపోయింది.

Tags

Next Story