కీర్తి సురేశ్ కల నెరవేరిన వేళ!

కీర్తి సురేశ్ కల నెరవేరిన వేళ!
మహానటి సినిమాతో మంచి ఫేం సంపాదించుకుంది నటి కీర్తి సురేష్.. ఈ సినిమా తర్వాత గ్లామర్ పాత్రల కన్నా.. ప్రాధాన్యత ఉన్న పాత్రలను, కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తుంది.

మహానటి సినిమాతో మంచి ఫేం సంపాదించుకుంది నటి కీర్తి సురేష్.. ఈ సినిమా తర్వాత గ్లామర్ పాత్రల కన్నా.. ప్రాధాన్యత ఉన్న పాత్రలను, కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే త్వరలో 'వాషి' అనే మలయాళ చిత్రంలో నటించనుంది కీర్తి. అయితే ఈ సినిమాకు ఆమె తల్లిదండ్రులు సురేశ్ కుమార్, రేవతి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తాజాగా వెల్లడించింది.

దాదాపు 7 ఏళ్లకు తన కల నెరవేరుతోందని, తను నటిస్తున్న ప్రాజెక్టును తన తండ్రే నిర్మిస్తుండటం చాలా ఆనందంగా ఉందని కీర్తి తెలిపింది. ఈ మూవీలో టొవిన్ థామస్ లీడ్ రోల్ పోషిస్తుండగా విష్ణు జీ రాఘ‌వ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఏడాదే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా ప్రస్తుతం కీర్తి తెలుగులో మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ మరియు 14 రీల్స్ ప్లస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పరుశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story