టాలీవుడ్

Keerthy Suresh : గర్భవతిగా కనిపించనున్న మహానటి..!

Keerthy Suresh :మహానటి లాంటి హ్యూజ్ సక్సెస్ తరువాత, కీర్తి సురేష్ ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలనే చేస్తూ వస్తుంది. పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఆ కోవాలోకే వస్తాయి.

Keerthy Suresh : గర్భవతిగా కనిపించనున్న మహానటి..!
X

మహానటి లాంటి హ్యూజ్ సక్సెస్ తరువాత, కీర్తి సురేష్ ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలనే చేస్తూ వస్తుంది. పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఆ కోవాలోకే వస్తాయి. గుడ్ లక్ సఖి అనే మరో చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పుడు మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకి కీర్తి సురేష్ సైన్ చేసినట్టుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం హిందీలో మంచి హిట్ అయిన 'మిమి' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనీ ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం కీర్తి సురేష్ ను సంప్రదించగా ఆమె కూడా ఒకే చెప్పినట్టుగా తెలుస్తోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ మిమి చిత్రంలో కృతి సనన్ ప్రధాన పాత్రలో నటించింది. ఓ విదేశీ జంటకు బిడ్డను ఇవ్వడం కోసం సరోగసీ ద్వారా గర్భం దాల్చిన ఓ పెళ్లి కాని యువతి కథే ఈ చిత్రం. దీనిపైన త్వరలోనే ఓ అధికార ప్రకటన వెలువడనుంది.

Next Story

RELATED STORIES