Keerthy Suresh Marriage..అనిరుధ్‌తో కీర్తి సురేష్ పెళ్లంట.. సోషల్ మీడియాలో వైరల్

'నేను శైలజ' మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి.. యువతను ఫిదా చేసిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. మహానటిగా తెలుగు తెరపై మంచి క్రేజ్ సంపాదించుకుంది. మహానటిలో తన నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. తెలుగు వెండితెరపై టాప్ హీరయిన్‌గా కొనసాగుతున్న కీర్తి సురేష్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. కీర్తి సురేష్ ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్‌తో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు త్వరలో అనిరుధ్‌తో కీర్తి సురేష్ పెళ్లంట.. అని వార్తలు చక్కర్లుకొడుతున్నాయి.
అయితే ఇలాంటి రూమర్లు ఈ 'మహానటి'కి కొత్తేమి కాదు.. గతంలోనూ చాలా మంది సెలబ్రెటీలతో లవ్, మ్యారేజ్ అంటూ వదంతులు వచ్చాయి. ఇటీవలే ఓ బీజేపీ లీడర్ కుమారుడితో కీర్తికి మ్యారేజ్ చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పందం కుదుర్చుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ కీర్తి కుటుంబ సభ్యులు అవి రూమర్లు అంటూ కొట్టిపారేశారు. ఇప్పుడు అనిరుధ్ రవిచందర్‌తో కీర్తి డేటింగ్ చేస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. త్వరలోనే మ్యారేజ్ కూడా చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో మరోసారి సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మ్యారేజ్ ట్రెండింగ్ అవుతోంది ( Keerthy Suresh Marriage ).
ప్రస్తుతం కీర్తి సురేష్.. మహేష్ బాబుకు జోడిగా 'సర్కార్ వారి పాట' మూవీలో నటిస్తుంది. నితిన్ హీరోగా నటిస్తున్న 'రంగ్‌దే' లోనూ కీర్తి నటిస్తోంది. మరోవైపు నగేష్ కుకునూర్ దర్శకత్వంలో వస్తోన్న 'గుడ్ లక్ సఖి' మూవీ కూడా చేస్తూ బిజీగా ఉంది కీర్తి సురేష్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com