Tollywood Drugs Case: కెల్విన్ చెప్పిన టాలీవుడ్ సెలబ్రెటీలపై కేసు పెట్టలేం.. ఎక్సై‌జ్ శాఖ

Tollywood Drugs Case: కెల్విన్ చెప్పిన టాలీవుడ్ సెలబ్రెటీలపై కేసు పెట్టలేం.. ఎక్సై‌జ్ శాఖ
సెలబ్రిటీలపై కెల్విన్ చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవు - ఎక్సైజ్

టాలీవుట్‌ ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న డ్రగ్స్‌ కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రధాన నిందితుడు కెల్విన్‌పై ఆబ్కారీ శాఖ ఛార్జ్‌షీట్‌ వేసింది. ఆ ఛార్జ్‌షీట్‌లో సినీ తారల విచారణను ఎక్సైజ్‌ శాఖ ప్రస్తావించింది. అయితే నిందితులు, సాక్షుల జాబితాలో సినీ తారల పేర్లను పొందుపరచలేదు. డ్రగ్స్‌ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని కెల్విన్‌పై వేసిన ఛార్జ్‌షీట్‌లో ఎక్సైజ్‌ శాఖ పేర్కొంది. సినీ తారలు, విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, హోటల్‌ నిర్వాహకులకు డ్రగ్స్‌ అమ్మినట్లు కెల్వీన్‌ వాంగ్మూలం ఇచ్చాడని... సిట్‌ బృందం పలువురుకి నోటీసులు ఇచ్చి ప్రశ్నించిందని తెలిపింది. అయితే కెల్వీన్‌ చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవని... సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కెల్విన్‌ వాంగ్మూలం సరిపోదని ఎక్సైజ్‌ శాఖ తెలిపింది.


కెల్విన్‌పై ఛార్జ్‌షీట్‌లో సినీ తారల విచారణ ప్రస్తావించిన ఎక్సైజ్‌

నిందితులు, సాక్షుల జాబితాలో సినీ తారల పేర్లు పొందుపరచని ఎక్సైజ్ శాఖ

కెల్విన్ మంగళూరులో చదువుకునేటప్పుడు డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు - ఎక్సైజ్

2013 నుంచి తన స్నేహితులకు డ్రగ్స్ అమ్మడం మొదలు పెట్టాడు - ఎక్సైజ్

డ్రగ్స్‌ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవు - ఎక్సైజ్‌

సినీ తారలు, విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, హోటల్ నిర్వాహకులకు...

డ్రగ్స్‌ అమ్మినట్లు కెల్విన్ వాంగ్మూలం - ఎక్సైజ్‌

సిట్‌ బృందం పలువురుకి నోటీసులు ఇచ్చి ప్రశ్నించింది - ఎక్సైజ్‌

అన్ని రకాల సాక్ష్యాలను సిట్‌ బృందం పరిశీలించి, విశ్లేషించింది - ఎక్సైజ్‌

సెలబ్రిటీలపై కెల్విన్ చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవు - ఎక్సైజ్

కేవలం నిందితుడు చెప్పిన విషయాలను బలమైన ఆధారాలుగా భావించలేం - ఎక్సైజ్

సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కెల్విన్ వాంగ్మూలం సరిపోదు - ఎక్సైజ్

సెలబ్రిటీలు, ఇతర అనుమానితుల వద్ద డ్రగ్స్ లభించలేదు - ఎక్సైజ్

పూరీ జగన్నాథ్, తరుణ్ స్వచ్ఛందంగా బయో శాంపిల్స్ ఇచ్చారు - ఎక్సైజ్

గోవా, విదేశాల నుండి డార్క్ వెబ్ ద్వారా కెల్విన్ డ్రగ్స్ తెప్పించాడు - ఎక్సైజ్

వాట్సప్, మెయిల్ ద్వారా ఇతరుల నుంచి ఆర్డర్లు తీసుకొని డ్రగ్స్ సరఫరా చేశాడు - ఎక్సైజ్

చిరునామాలు, ఇతర కీలక వివరాలు దర్యాప్తులో కెల్విన్ వెల్లడించలేదు - ఎక్సైజ్

కెల్విన్ స్నేహితులు నిశ్చయ్, రవికిరణ్‌ల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలున్నాయి - ఎక్సైజ్

సోదాల సమయంలో కెల్విన్ వంటగది నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు - ఎక్సైజ్

Tags

Read MoreRead Less
Next Story