సినిమాల్లోకి కోడి రామకృష్ణ కూతురు.. హీరోగా ఎవరంటే?

సినిమాల్లోకి  కోడి రామకృష్ణ కూతురు.. హీరోగా ఎవరంటే?
X
దర్శకుడు కోడి రామకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంద చిత్రాలను తెరకెక్కించిన అతికొద్ది మంది దర్శకులలో ఆయన ఒకరు.

దర్శకుడు కోడి రామకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంద చిత్రాలను తెరకెక్కించిన అతికొద్ది మంది దర్శకులలో ఆయన ఒకరు. ముఖ్యంగా భక్తీ, గ్రాఫిక్స్ చిత్రాలకి ఆయన పెట్టింది పేరు. అమ్మోరు, దేవి, అరుంధతి చిత్రాలతో ఇండస్ట్రీలో ఆయన ఓ ట్రెండ్ సెట్ చేశారని చెప్పాలి. ఎన్నో హిట్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించిన కోడి రామకృష్ణ అనారోగ్య సమస్యలతో 2019 ఫిబ్రవ‌రి 22న కన్నుమూశారు.

ఆయన నట వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సిద్దమయ్యారు ఆయన కూతురు దివ్య దీప్తి. 'కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్' అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి ఆమె నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. తన మొదటి సినిమాకి గాను కిరణ్‌ అబ్బవరం అనే హీరోని ఎంచుకున్నారు. తొలి చిత్రానికి గాను కార్తీక్ శంకర్ అనే కొత్త డైరెక్టర్‌కు దివ్య అవకాశం ఇచ్చారు. ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే సినిమా షూటింగ్ మొదలు కానుంది.


Tags

Next Story