Mohan Babu : మోహన్‌‌బాబు స్కూల్లో చదువుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరు...?

Mohan Babu : మోహన్‌‌బాబు స్కూల్లో చదువుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరు...?
X
Mohan Babu : ఇదిలావుండగా తాజాగా అలీతో సరదాగా ప్రోగ్రాంకి విచ్చేసిన మోహన్ బాబు... ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

Mohan Babu : ఇండస్ట్రీలో తనకంటూ ఓ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న నటులలో మంచు మోహన్ బాబు ఒకరు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత విలన్ గా, హీరోగా, నిర్మాతగా ఇలా విభిన్నమైన కోణాల్లో తనదైన ముద్రవేశారు. వీటితోపాటుగా రాజకీయాల్లో, విద్యావేత్తగా కూడా రాణించారు ఆయన..

ఇదిలావుండగా తాజాగా అలీతో సరదాగా ప్రోగ్రాంకి విచ్చేసిన మోహన్ బాబు... ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా శ్రీ విద్యానికేతన్ స్కూల్లో చదువుకున్న ఎంతో మంది IAS, IPS ఆఫీసర్స్ అయ్యారని వెల్లడించారు. అలాగే ఓ అమ్మాయి హీరోయిన్ కూడా అయిందని, ఆమె ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుందని చెప్పుకొచ్చాడు.

అయితే ఆ అమ్మాయి పేరు గుర్తురావట్లేదని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఆ అమ్మాయి ఐశ్వర్య రాజేష్ అని తెలుస్తోంది. ఐశ్వర్య రాజేష్ తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ సినిమా నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తరవాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా రిపబ్లిక్ చిత్రంలో నటించి మెప్పించింది.

Tags

Next Story