Kota Srinivasa Rao : పవన్ అలా అనేసరికి కళ్ళలో నీళ్ళు వచ్చాయి..!

Kota Srinivasa Rao : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. అత్తారింటికి దారేది సినిమా సక్సెస్ మీట్ విషయాలను గుర్తుచేసుకున్నారు. ఈ వేడుకని భారీ ఎత్తున చేశారని, యూనిట్ మొత్తం ఆ వేడుకకు హాజరయ్యామని చెప్పుకొచ్చారు.
ఈ మీట్ లో అందరి గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ తన వరకు వచ్చేసరికి కోటగారు పెద్దవారు, ఆయన గురించి నేనేమని చెబుతాను? ఆయన గురించి మాట్లాడాలంటే నా వయసుగానీ, అనుభవం కానీ సరిపోదని అన్నారని ఆ మాటలు విన్నప్పుడు ఫస్ట్‌టైమ్ ఓ వేదిక మీద నాకు కళ్ళు చెమర్చయని, ఒక అరనిమిషం నా కళ్ళ నుండి నీళ్ళు కారాయని గుర్తుచేసుకున్నారు.
అంతటి క్రేజ్ ఉన్న నటుడు తన గురించి ఓ రెండు మాటలు గొప్పగా మాట్లాడడం తనకి గొప్పగా అనిపించిందని అన్నారు. అటు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ.. ఆయన సినిమాల్లో ఎక్కువ వేషాలు చేయకపోయినా, చేసిన తక్కువే అయిన గుర్తుండిపోయే పాత్రలు చేశానని అన్నారు. నాలోని నటుణ్ణి వెలికితీసిమరీ మంచి వేషాలిచ్చారని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com