టాలీవుడ్

Krishna Vamsi: ఓటీటీలోకి క్రియేటివ్ డైరెక్టర్.. రూ.300 కోట్లతో ప్రాజెక్ట్..

Krishna Vamsi: చాలామంది డైరెక్టర్లు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వగా.. ఇటీవల ఆయన ఎంట్రీ గురించి కూడా ఓ క్లారిటీ ఇచ్చారు కృష్ణవంశీ

Krishna Vamsi: ఓటీటీలోకి క్రియేటివ్ డైరెక్టర్.. రూ.300 కోట్లతో ప్రాజెక్ట్..
X

Krishna Vamsi: ఈమధ్యకాలంలో యంగ్ డైరెక్టర్ల కథలకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. అందుకే సీనియర్ దర్శకులు వారితో పోటీపడడం కోసం మరింత క్రియేటివ్‌గా, కొత్త ఐడియాలతో ముందుకొస్తున్నారు. కాస్త సమయం తీసుకున్నా కూడా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో సినిమాలు చేస్తున్నారు సీనియర్ డైరెక్టర్స్. అందులో ఒకరు కృష్ణవంశీ. తాజాగా ఈయన చేయబోయే ఓ పెద్ద ప్రాజెక్ట్ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు.

క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ.. ప్రస్తుతం కాస్త స్లో అయ్యారు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఎదురవ్వడంతో సినిమాలు చేసే విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్న 'రంగమార్తాండ' చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించాల్సి ఉండగా కృష్ణవంశీ.. ఇటీవల ఓ ఇంటర్వూలో పాల్గొన్నారు.

ఓటీటీలో తాను ఓ ప్రాజెక్ట్ చేసే ప్లాన్‌లో ఉన్నట్టు తెలిపారు కృష్ణవంశీ. ఇప్పటికే చాలామంది స్టార్ డైరెక్టర్లు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వగా.. ఇటీవల ఆయన ఎంట్రీ గురించి కూడా ఓ క్లారిటీ ఇచ్చారు కృష్ణవంశీ. ఏది అనుకుంటే అది తీసే స్వేచ్ఛ ఓటీటీలో ఉంటుందని, నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం కూడా ఉండదని ఆయన అన్నారు. పైగా ఈ ప్రాజెక్ట్ రూ.200 నుండి 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుందని, వచ్చే ఏడాది అది సెట్స్‌పైకి వెళ్లనుందని వెల్లడించారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES