Krishna Vamsi: 'అలాంటివి ఖండించాలి అనుకోవట్లేదు'.. విడాకులపై కృష్ణవంశీ కామెంట్స్

Krishna Vamsi: టాలీవుడ్‌లో విడాకుల వార్తలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఒకరు తర్వాత ఒకరు సౌత్ సినీ సెలబ్రిటీలంతా విడాకులు తీసుకోవడం వారి ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అంతే కాకుండా ఇంకా ఎందరో విడాకులు తీసుకోబోతున్నారు అనే రూమర్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అందులో ఒక జంట కృష్ణవంశీ, రమ్యకృష్ణ. ఇక వీరి విడాకుల వార్తలపై ఇటీవల కృష్ణవంశీ నోరువిప్పారు.
కృష్ణవంశీ గతకొంతకాలంగా ఫామ్‌లో లేరు. ఆయన చేసిన చాలావరకు సినిమా ఫ్లాప్‌గా నిలిచాయి. దీంతో ఎలాగైనా గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని బలంగా ఫిక్స్ అయ్యారు కృష్ణవంశీ. అందుకే తన అప్‌కమింగ్ మూవీ 'రంగమార్తాండ' కోసం ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే రంగంలోకి దించారు. అంతే కాకుండా ఈ మూవీ కోసం ఇప్పటినుండే ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టారు.
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పెళ్లి, విడాకుల గురించి స్పందించారు కృష్ణవంశీ. బాధ్యతలంటే భయంతో పెళ్లి వద్దనుకున్నా రమ్యకృష్ణతో వివాహం జరిగిందని, ఇదంతా లైఫ్ డిజైన్ అని భావిస్తానని ఆయన అన్నారు. పెళ్లి తర్వాత తన జీవితంలో పెద్దగా మార్పులు రాలేదని, రమ్యకృష్ణ తనను తనలా ఉండనిచ్చిందని బయటపెట్టారు. ఇక విడాకుల వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేల్చేశారు. పబ్లిక్ ఫిగర్స్‌గా ఉన్నప్పుడు ఇలాంటి పుకార్లు వస్తుంటాయని, వాటిని తాము పెద్దగా పట్టించుకోమని చెప్పారు. వాటిని ఖండించాలని కూడా అనుకోరని, నవ్వి ఊరుకుంటారని క్లారిటీ ఇచ్చారు కృష్ణవంశీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com