krithi shetty : బెల్లంకొండ గణేష్ సరసన బేబమ్మ ?

krithi shetty : ఈ ఏడాది విడుదలైన సినిమాలలో ఉప్పెన భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది కన్నడ బ్యూటీ కృతిశెట్టి.. ఈ సినిమాలోని ఆమె నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆమెకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో తెరకేక్కబోయే ఓ చిత్రంలో ఈ భామ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. అటు నాని శ్యాం సింగరయలో కూడా నటిస్తుంది.
అయితే ఇప్పుడు ఈ భామ మరో సినిమా ఆఫర్ దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా పవన్ సాదినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతిశెట్టి ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, అమృతరావు జంటగా నటించిన 'వివాహ్' చిత్రానికి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com