29 May 2022 3:00 PM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / Krithi Shetty:...

Krithi Shetty: ఇంటర్వ్యూలో కంటతడి పెట్టిన కృతి శెట్టి.. అలా చేస్తే నచ్చదంటూ..

Krithi Shetty: కృతి ప్రస్తుతం చాలా సినిమాల్లో నటిస్తున్నా.. అందులో ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది 'ది వారియర్'.

Krithi Shetty: ఇంటర్వ్యూలో కంటతడి పెట్టిన కృతి శెట్టి.. అలా చేస్తే నచ్చదంటూ..
X

Krithi Shetty: కృతి శెట్టి.. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగానే.. ఇలా సెన్సేషన్‌గా మారిపోయిన నటి. 'ఉప్పెన' అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమయినా.. ఆ మూవీ విడుదల కాకముందే దాదాపు అరడజను ఆఫర్లు కృతిని వెతుక్కుంటూ వచ్చాయి. అంతే కాకుండా ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ నుండి కూడా ఈ భామ ఆఫర్లు అందుకుంటోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంటతడి పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


కృతి ప్రస్తుతం చాలా సినిమాల్లో నటిస్తున్నా.. అందులో ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది 'ది వారియర్'. లింగుసామి దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కృతి ఓ అల్లరి పిల్ల పాత్రలో కనిపించనుంది. అయితే ఈ మూవీ తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కానుంది. అందుకోసమే కృతి ఓ తమిళ ఛానెల్‌కు ఇంటర్వూ ఇచ్చింది.


తమిళ ప్రాంక్ స్టార్స్ ఆషిక్‌, సారథిరన్‌.. కృతిని ఇంటర్వ్యూ చేశారు. ఇదే క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం మొదలయ్యింది. దీంతో కృతికి ఏం అర్థం కాక అక్కడే అలా ఆందోళనతో కూర్చుండిపోయింది. మధ్యలో సారథిరన్‌ ఆషిక్‌‌పై చేయి చేసుకోవడంతో తనలో కంగారు మరింత ఎక్కువయ్యింది. అయితే చివరిలో ఇదంతా ప్రాంక్ అన్నారు సారథిరన్‌, ఆషిక్‌.

ప్రాంక్ అని చెప్పగానే నవ్వేసిన కృతి.. ఆ తర్వాత కంటతడి పెట్టుకుంది. తనకు ఎవరైనా గట్టిగా, కఠినంగా మాట్లాడితే నచ్చదని చెప్తూ ఏడ్చేసింది. ఇటీవల విడుదలయిన ఈ ఇంటర్వ్యూ ప్రోమోలో ఇదంతా ఉండడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన చాలామంది నెటిజన్లు కృతి చాలా సెన్సిటివ్ అని అభిప్రాయపడుతున్నారు.



Next Story