టాలీవుడ్

'ఉప్పెన' హీరోయిన్‌కి ఆఫర్లు.. కృతి కోసం క్యూ కడుతున్న హీరోలు..

తాను నటించిన మొదటి చిత్రం ఇంకా రిలీజ్ కానేలేదు. మరిన్ని అవకాశాలు ఈ మలయాళీ ముద్దుగుమ్మను వరిస్తున్నాయి.

ఉప్పెన హీరోయిన్‌కి ఆఫర్లు.. కృతి కోసం క్యూ కడుతున్న హీరోలు..
X

Krithi Shetty: ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ కృతిశెట్టికి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. తాను నటించిన మొదటి చిత్రం ఇంకా రిలీజ్ కానేలేదు. మరిన్ని అవకాశాలు ఈ మలయాళీ ముద్దుగుమ్మను వరిస్తున్నాయి. అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా ఆకర్షిస్తున్న కృతి హీరో నానీ పక్కన నటించే అవకాశాన్ని కొట్టేసినట్లు తెలుస్తోంది. శామ్ సింగరాయ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సుధీర్ బాబు హీరోగా నటించే చిత్రంతో పాటు మరి కొంత మంది యంగ్ హీరోలు కూడా కృతి కోసం అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. ఇక ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ తదుపరి చిత్రంలోనూ కృతీనే హీరోయిన్ అని అంటున్నారు. పూరీజగన్నాథ్ నిర్మాతగా తన దగ్గర శిష్యరికం చేసిన ఓ కొత్త కుర్రాడిని ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం చేయబోతున్నాడని టాక్. ప్రస్తుతం ఆకాష్ హీరోగా 'రొమాంటిక్' తెరెకెక్కుతోంది.

Next Story

RELATED STORIES