Krithi Shetty: కృతి శెట్టి సంచలన నిర్ణయం.. సర్జరీకి సిద్ధం..

Krithi Shetty: చాలా చిన్న వయసులోనే హీరోయిన్‌గా అడుగుపెట్టి డెబ్యూ మూవీతోనే ఎక్కడలేని పాపులారిటీని సంపాదించుకుంది కృతి శెట్టి. తన మూడో సినిమాకే స్టార్ హీరోయిన్లతో సమానంగా రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసింది. అంతే కాకుండా అంత రెమ్యునరేషన్‌కు నిర్మాతలు కూడా ఓకే చెప్పడం విశేషం. తాజాగా ఈ భామ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ఫిల్మ్ సర్కి్ల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
డెబ్యూ మూవీ 'ఉప్పెన'లో తన యాక్టింగ్‌తో ఆకట్టుకోవడంతో దాదాపు అరడజను అవకాశాలు కృతిని వెతుక్కుంటూ వచ్చాయి. అలా వచ్చిన సినిమాల్లో చాలావరకు సినిమాలను కృతి.. తన బిజీ షెడ్యూల్ వల్ల ఓకే చేయలేకపోయింది కూడా. కానీ కృతి స్పీడ్‌కు 'ది వారియర్' చిత్రం బ్రేకులేసింది. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాబట్టలేక డిసాస్టర్‌గా నిలిచింది. రామ్ హీరోగా నటించిన 'ది వారియర్' పక్కా కమర్షియల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ మెప్పించలేకపోయింది.
ది వారియర్‌తో కృతి తన కెరీర్‌లోని మొదటి ఫ్లాప్‌ను మూటగట్టుకుంది. దీని వల్ల తనపై నెగిటివ్ కామెంట్స్ కూడా మొదలయ్యాయి. కృతి పెదాలు చాలా పెద్దగా ఉంటాయని, తన మొహానికి అస్సలు సెట్ అవ్వవని ప్రేక్షకులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో తన పెదాలకు సర్జరీ చేయించుకోవాలని కృతి నిర్ణయించుకుందట. దీని కోసం ఓ ప్రముఖ డాక్టర్‌ను కూడా సంప్రదించినట్టు సమాచారం. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు సర్జరీ వల్ల తమ మొహంలో మార్పులు చేసుకున్నారు. ఆ లిస్ట్‌లో ఇప్పుడు కృతి కూడా చేరనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com