8 July 2022 10:48 AM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / Krithi Shetty: స్టార్...

Krithi Shetty: స్టార్ హీరోలకు టెండర్ వేసిన కృతి.. వారితో నటించాలనుంది అంటూ..

Krithi Shetty: హీరోయిన్‌గా పరిచయమయినప్పటి నుండి పలు సందర్భాల్లో కృతి.. రామ్ చరణ్‌పై తన ఇష్టాన్ని బయటపెట్టింది.

Krithi Shetty: స్టార్ హీరోలకు టెండర్ వేసిన కృతి.. వారితో నటించాలనుంది అంటూ..
X

Krithi Shetty: ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోయిన్ల మధ్య పోటీ పెరిగిపోయింది. కొత్తగా పరిచయమవుతున్న ముద్దుగుమ్మలపైనే ఎక్కువగా మేకర్స్ దృష్టి ఉంది. అందులో అందరికంటే తొందరగా బిజీ హీరోయిన్ అయిపోయింది కృతి శెట్టి. 'ఉప్పెన' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయిన కృతి శెట్టికి ఆ మూవీ విడుదల్వక ముందు నుండే ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ హీరోయిన్‌గా మార్చేశాయి. ఇలాంటి సమయంలోనే తాను ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి నటించాలనుందని మనసులో మాట బయటపెట్టింది.

ఉప్పెన విడుదలయిన తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కృతి శెట్టి. చాలావరకు తన దగ్గరకు వస్తున్న ఆఫర్లను యాక్సెప్ట్ చేస్తూ.. డేట్స్ కారణంగా కొన్నింటిని రిజెక్ట్ చేస్తూ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. ప్రస్తుతం రామ్‌తో తను నటించిన 'ది వారియర్' చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఆ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది కృతి. అలా ఓ ఇంటర్వ్యూలో తాను తెలుగులో ఎవరితో కలిసి నటించాలి అనుకుంటుందో చెప్పేసింది.

హీరోయిన్‌గా పరిచయమయినప్పటి నుండి పలు సందర్భాల్లో కృతి.. రామ్ చరణ్‌పై తన ఇష్టాన్ని బయటపెట్టింది. రామ్ చరణ్ అంటే తనకు క్రష్ అని, తనతో కలిసి నటించాలని ఉందని కూడా చెప్పింది. ఇప్పుడు రామ్ చరణ్‌తో పాటు మహేశ్ బాబుతో కూడా కలిసి నటించాలనుందని అంటోంది కృతి. ఇక ప్రస్తుతం కృతి తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ కోలీవుడ్‌లో కూడా తన సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది.



Next Story