Krishnam Raju : కృష్ణంరాజు సినీ ప్రస్థానం..

Krishnam Raju : కృష్ణంరాజు సినీ ప్రస్థానం..
Krishnam Raju : ఆరడుగుల విగ్రహం.. కరడుగట్టిన రౌడీల్లో సైతం వణుకు పుట్టించే చూపు.. ఎంతటి వారినైనా మట్టి కరిపించే కటౌట్

Krishnam Raju : ఆరడుగుల విగ్రహం.. కరడుగట్టిన రౌడీల్లో సైతం వణుకు పుట్టించే చూపు.. ఎంతటి వారినైనా మట్టి కరిపించే కటౌట్.. కలిపితే రెబల్ స్టార్ కృష్ణంరాజు. రెబల్ స్టార్ అనే బిరుదుకు తను తప్ప ఇంకెవరూ సరిపోరని నిరూపించుకున్న ఏకైక టాలీవుడ్ రెబల్ స్టార్ ఆయన. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ కూడా ఉంటే అది సిల్వర్ స్క్రీన్ పై ఎలా వెలిగిపోతుందో అనేదానికి కృష్ణంరాజు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. హీరో కావాలని వచ్చి.. విలన్ గా ఆకట్టుకుని ఆ తర్వాత రెబల్ స్టార్ గా ప్రేక్షకుల్లో తిరుగులేని స్థానం సంపాదించుకున్నారు.

కృష్ణంరాజు పుట్టింది పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో. కొన్నాళ్లు ఓ తెలుగు పత్రికలో జర్నలిస్ట్ గా కూడా పనిచేశారు. తర్వాత దర్శకుడు ప్రత్యగాత్మ పరిచయంతో ఆయనే నిర్మించి డైరెక్ట్ చేసిన చిలకా గోరింక చిత్రంలో వేషం వచ్చింది. ఆ తర్వాత తనదైన వైవిధ్యమైన ఆహార్యంతో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సపోర్ట్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ వచ్చాడు. అయితే తన కటౌట్ చూసిన ఎవరైనా అతను విలన్ కంటే హీరోగానే బావుంటాడనుకున్నా.. ముందుగా ఛాన్స్ ఇచ్చేవారే దొరకలేదు.

హీరోగా మారకముందు.. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ లాంటి హీరోల చిత్రాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించారు. జీవనతరంగాలు.. మానవుడు దానవుడు, జై జవాన్, బడిపంతులు వంటి చిత్రాల్లో వైవిధ్యమైన నటనతో ఆకట్టుకున్నాడు. 1966లో చిలకా గోరింక తో ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలాకాలం వరకూ ప్రామిసింగ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు.

నిజానికి ఆ టైమ్ లో ఉన్న ఎంతో మంది హీరోలకు ఏమాత్రం తీసిపోని కటౌట్ కృష్ణంరాజుది. కానీ ముందుగా వచ్చిన అవకాశాలే చేసుకుంటూ పోవడంతో మాగ్జిమం నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లే దక్కాయి. కానీ మనసులో తనే హీరో కావాలన్న కోరిక బలంగా ఉండేధి. అందుకే తనే సొంతంగా ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పాడు. గోపీకృష్ణా బ్యానర్ ను స్థాపించి తమ్ముడు సూర్యనారాయణరాజును నిర్మాతగా చేసి తొలి ప్రయత్నంగా కృష్ణవేణి అనే చిత్రాన్ని నిర్మించారు. యాంటీసెంటిమెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. తర్వాత తమ బ్యానర్ లోనే వింతదంపతులు చిత్రంతో హీరోగా మారాడు.

వింతదంపతులు తర్వాత కృష్ణంరాజు హీరో మెటీరియల్ అని అందరికీ అర్థమైంది. అదే టైమ్ లో దాసరి నారాయణరావు, వి మధుసూదన్ రావు వంటి దర్శకులు కూడా పాజిటివ్ పాత్రలతో బాగా ఎంకరేజ్ చేశారు. అలా బంట్రోతు భార్య, కృష్ణవేణి చిత్రాల్లో కృష్ణంరాజు నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే మొత్తంగా స్టార్ హీరోగా కృష్ణంరాజుకు పర్ఫెక్ట్ బ్రేక్ వచ్చింది మాత్రం భక్తకన్నప్ప చిత్రంతో. గోపీకృష్ణా బ్యానర్ లో నిర్మితమై, బాపు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఓ క్లాసిక్ గా మిగిలింది.

అలా మొదలైన విజయ ప్రస్థానం కృష్ణంరాజు కెరీర్ ను స్పీడప్ చేసింది. తర్వాత కమలాకర కామేశ్వరరావు డైరెక్షన్ లో వచ్చిన కురుక్షేత్రం చిత్రంలో కర్ణుడిగా నటించాడు. ఇక అతను వెను తిరిగి చూడాల్సిన పనిలేకుండా చేసిన చిత్రం రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన అమరదీపం. కృష్ణంరాజు కెరీర్ లో టాప్ ఫైవ్ మూవీస్ లో ఒకటిగా నిలిచే చిత్రం అమరదీపం. ఆ తర్వాత వచ్చిన జీవనతీరాలు కూడా మంచి విజయం సాధించడంతో మహిళా అభిమానుల్ని కూడా సంపాదించుకున్నాడు.

అయితే కృష్ణంరాజు ఫిజిక్ చూసిన ఎవరికైనా ఇతను యాక్షన్ హీరో అనిపిస్తుంది. అందుకు తగ్గట్టే తను రూట్ లోనే వెళ్లాడు. అయితే ఇందుకు ప్రధాన కారణం దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన కటకటాల రుద్రయ్య. అదే టైమ్ లో బాపు డైరెక్షన్ లో వచ్చిన మనవూరి పాండవులు చిత్రంలోని పాత్ర కృష్ణంరాజుకు ఎంతో పేరు తెచ్చింది.

సొంత బ్యానర్ గోపికృష్ణా మూవీస్‌లో కృష్ణంరాజు నటించిన రెండో సినిమా భక్త కన్నప్ప. అప్పట్లో ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టింది. కృష్ణంరాజు కెరీర్‌లోనే గొప్ప చిత్రంగా నిలిచిపోయింది. చిత్ర రిలీజ్‌ అయిన అన్ని సెంటర్‌లలో 25 వారాల పాటు ఆడింది. 1984లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో బొబ్బిలి బ్రహ్మణ్ణ చిత్రం తీశారు. ఈ చిత్రం కూడా అఖండ విజయం సాధించింది. దాసరి నారాయణరావుతో తీసిన తాండ్ర పాపరాయుడు మంచి గుర్తింపునిచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story