Kushi 2022: శరవేగంగా 'ఖుషి' షూటింగ్.. ఇంతలోనే మరో అప్డేట్..

Kushi 2022: సినిమా షూటింగ్ అనేది చాలా సమయం తీసుకునే పని. అందుకే విడుదల ఒక తేదీకి అనౌన్స్ చేసినా.. ఆ సమయానికి షూటింగ్ పూర్తి అవ్వక వాయిదా పడిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ 'ఖుషి' టీమ్ అలా కాదు. వీళ్ల షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. అందుకే డైరెక్టర్ శివ నిర్వాణ ఇటీవల ఈ సినిమా గురించి ఓ అప్డేట్‌ను ట్వీట్ చేశాడు.
యూత్‌ఫుల్ ప్రేమకథలతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు శివ నిర్వాణ. అలాంటి మరో ప్రేమకథ ఖుషితోనే డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విజయ్ దేవరకొండ, సమంత.. ఇందులో హీరోహీరోయిన్లుగా నటించడం వల్ల ఇప్పటికే సినిమాకు కావాల్సినంత హైప్ వచ్చేసింది. అయితే ఈ మూవీ పూజా కార్యక్రమాలు చేసిన కొన్ని రోజుల్లోనే షూటింగ్‌ను ప్రారంభించింది. అంతే కాకుండా మూవీ టీమ్ ఇప్పుడు మరో అప్డేట్ రిలీజ్ చేసింది.
పూజా కార్యక్రమం పూర్తయ్యాక, కశ్మీర్‌లో షూటింగ్ ప్రారంభించి, టైటిల్ లుక్ రిలీజ్ చేసి.. వెంటవెంటనే ప్రేక్షకులకు షాకిచ్చింది ఖుషి టీమ్. ఇప్పుడు కశ్మీర్ షెడ్యూల్ కూడా పూర్తయ్యిందంటూ మరో షాక్ ఇచ్చింది. కశ్మీర్ షెడ్యూల్ పూర్తయ్యిందంటూ.. తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణం అంటూ ట్వీట్ చేశాడు దర్శకుడు శివ నిర్వాణ. దీనికోసం తన టీమ్‌కు థాంక్యూ కూడా చెప్పుకున్నాడు.
Amazing first schedule in kashmir
— Shiva Nirvana (@ShivaNirvana) May 23, 2022
Thankyou @TheDeverakonda @Samanthaprabhu2 @vennelakishore #saranyapradeep and Whole #khushiteam 👏 congratulations
#khushiondec23 #khushi pic.twitter.com/jax2pkYRvS
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com