టాలీవుడ్

Liger Movie: త్వరలోనే 'లైగర్' ప్రమోషన్స్ షురూ.. ట్రైలర్ ఎప్పుడంటే..?

Liger Movie: పూరీ, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లైగర్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.

Liger Movie: త్వరలోనే లైగర్ ప్రమోషన్స్ షురూ.. ట్రైలర్ ఎప్పుడంటే..?
X

Liger Movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. త్వరలోనే పాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడు. కేవలం తెలుగు సినిమాలతోనే విజయ్.. బాలీవుడ్‌లో కూడా ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు ఏకంగా పలు భాషల్లో తన సినిమాను విడుదల చేస్తూ.. తన మార్కెట్‌ను పెంచుకోవాలనుకుంటున్నాడు. అలా విజయ్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం 'లైగర్'. ఈ సినిమా గురించి ప్రస్తుతం ఓ క్రేజీ అప్డేట్ ఫిల్మ్ సర్కి్ల్లో చక్కర్లు కొడుతోంది.

పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లైగర్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. కాకాపోతే పలు కారణాల వల్ల ఇప్పటికీ ఈ మూవీ షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా చివరి పాటతో షూటింగ్ పూర్తి చేసుకున్న లైగర్.. పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి అడుగుపెట్టింది. ఆ సందర్భంగా మూవీ టీమ్ ఓ ట్వీట్ ద్వారా ప్రమోషన్స్ గురించి అప్డేట్ ఇచ్చింది.

10 రోజుల్లో లైగర్ ప్రమోషన్స్ ప్రారంభమవుతాయని మూవీ టీమ్ వెల్లడించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో లైగర్ ప్రమోషన్స్ జరగునున్నట్టు సమాచారం. అయితే ట్రైలర్ జులై రెండో వారంలో విడుదల కానున్నట్టు ప్రచారం సాగుతోంది. మూవీ టీమ్ చెప్పినదాని ప్రకారం.. ముందుగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌తోనే ప్రమోషన్ కార్యక్రమాలకు శ్రీకారం జరగనందని తెలుస్తోంది.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES