Liger Song: 'లైగర్' నుండి మాస్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. 'అకడి పకడి' అంటున్న విజయ్..

Liger Song: లైగర్ నుండి మాస్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. అకడి పకడి అంటున్న విజయ్..
Liger Song: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్‌లో చేస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’.

Liger Song: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్‌లో చేస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం 'లైగర్'. పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విజయ్.. బాక్సర్‌గా కనిపించనున్నాడు. దీనికోసం ఈ హీరో స్పెషల్‌గా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. పైగా ఈ సినిమాతో మైక్ టైసన్ మొదటిసారి ఇండియన్ సినిమాకు పరిచయమవుతున్నారు. తాజాగా లైగర్ నుండి ఓ మాస్ పాట ప్రోమో విడుదలయ్యింది.

లైగర్ సినిమా నుండి ఇప్పటివరకు గ్లింప్స్, టీజర్, ఓ పాట విడుదలయ్యాయి. కానీ అనన్య పాండే వాటిలో ఎక్కడా కనిపించలేదు. మొదటిసారి అనన్యతో విజయ్ స్టెప్పులేస్తున్న పాట ప్రోమో విడుదలయ్యింది. అదే అకడి పకడి. ఈ పాటలో విజయ్ మాస్ స్టెప్పులతో రెచ్చిపోయాడు. ఇక అనన్య పాండే కూడా తనదైన గ్లామర్‌ను పాటకు యాడ్ చేసింది. రౌడీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న లైగర్ సినిమా ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Read MoreRead Less
Next Story