Love Story Movie : మహేష్‌‌కు కలిసొచ్చిన 'లవ్ స్టోరీ'.. కాసుల వర్షం..!

Love Story Movie : మహేష్‌‌కు కలిసొచ్చిన లవ్ స్టోరీ.. కాసుల వర్షం..!
Love Story Movie : అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్ స్టోరీ' .. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదలైంది.

Love Story Movie : అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్ స్టోరీ' .. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదలైంది. మౌనిక, రేవంత్.. ఈ రెండు పాత్రలు సినిమాకి జీవం పోశాయనే చెప్పాలి. సున్నిత‌మైన అంశాల్ని స్పృశిస్తూనే చక్కని భావోద్వేగాలతో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు శేఖర్ కమ్ముల. మెుదటిరోజే ఊహకందని రీతిలో కలెక్షన్లను కొల్లగొట్టంది ఈ చిత్రం. రిలిజై నెల కావొస్తున్న ఇంకా ధియేటర్లో ఆడుతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ధియేటర్ లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే కావడం విశేషం. ఇప్పుడు ఈ సినిమా రికార్డ్ స్టాయిలో కలెక్షన్స్‌ రాబడుతోంది.

దీనితో దర్శక-నిర్మాతలకే కాదు థియేటర్ల యాజమాన్యాలకు సైతం ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ఏకంగా ఓ థియేటర్‌కు అయితే ఏకంగా కోటీ రూపాయలకు పైగా కలెక్షన్స్‌ ని తెచ్చిపెట్టింది. ఇంతకీ ఆ ఆ థియేటర్‌ ఎవరిదో కాదు... మహేష్ బాబుకి చెందిన ఏఎంబీ(AMB) సినిమాస్ మ‌ల్టీప్లెక్స్‌. ఆ మ‌ల్టీప్లెక్స్‌ లో కోటి రూపాయలు వసూలు చేసిన తొలిచిత్రం ఇదే కావడం విశేషం. ఇప్పటివ‌ర‌కు ఏఎమ్‌బీ థియేటర్లో 251 షోలు నిర్వ‌హించ‌గా.. 48,233 మంది వీక్షించారట.. దీనికి గాను సంతోషిస్తూ ట్వీట్ చేసింది ఏఎంబీ యాజమాన్యం.


Tags

Read MoreRead Less
Next Story