"మా ఊరి పొలిమేర-2" లచ్చిమి పుట్టిన రోజు

మా ఊరి పొలిమేర-2 లచ్చిమి పుట్టిన రోజు
ప్రియురాలు సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టిన కామాక్షి భాస్కర్ల పుట్టిన రోజు నేడు. కామాక్షి భాస్కర్ల కేవలం నటి మాత్రమే కాదు ఆమె ఒక డాక్టరు కూడా చైనాలో మెడిసిన్‌ చదివి కొంతకాలం అపోలో వైద్యురాలుగా కూడా పని చేసింది

ప్రియురాలు సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టిన కామాక్షి భాస్కర్ల పుట్టిన రోజు నేడు. కామాక్షి భాస్కర్ల కేవలం నటి మాత్రమే కాదు ఆమె ఒక డాక్టరు కూడా చైనాలో మెడిసిన్‌ చదివి కొంతకాలం అపోలో వైద్యురాలుగా కూడా పని చేసింది. ఆ తరువాత మోడలింగ్‌లోను తన ప్రతిభను చాటుకుంది. 2018లో మిస్‌ తెలంగాణగా ఎంపిక అయింది. అలాగే 2018 మిస్‌ ఇండియా పోటీల్లో ఈ అమ్మడు ఫైనల్స్‌ వరకు చేరుకుంది. 2022 సంవత్సరంలో ప్రియురాలు సినిమాతో తెరంగేట్రం చేసింది ఈ చిన్నది. ఆతరువాత వచ్చిన అఖిల్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్ సినిమాలో కూడా కామాక్షి నటించింది.

రౌడీ బాయ్స్‌, లోకూడా మెరింసింది అయితే మా ఊరి పొలిమేర సినిమాతో ప్రేక్షుల మనసులో నిలిచిపోయింది. ఓటీటీలో విడుదలైన మా ఊరి పొలిమేర సినిమా క్రైమ్‌ థిల్లర్‌ కాంబోలో సత్యం రాజేష్‌, కామాక్షి ప్రాధాన పాత్రల్లో వచ్చిన సినిమా అందరిని అలరించింది. ఈ సినిమా సీక్వెల్‌ కూడా ఉంటుందని అప్పుడే మేకర్స్‌ చెప్పారు. దీంతో పొలిమేర-2 సినిమా శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బేన‌ర్ పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ నిర్మాత‌గా `మా ఊరి పొలిమేర` కు సీక్వెల్ తెర‌కెక్కుతోంది. డా.అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కుడు. స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, బాలాదిత్య, ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్‌ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఉత్త‌రాఖండ్‌, కేర‌ళ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఖ‌మ్మం, హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమా విడుదల ప్రమోషన్స్‌ భాగంలోనే ఇటీవలే చిత్ర బృదం మంత్రి తలసాని చేతుల మీదుగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అయితే ఈ సినిమాకు గ్యాని సంగీతం అందిస్తుండగా సినిమాటోగ్ర‌ఫీ ఖుషేంద‌ర్ ర‌మేష్ రెడ్డి చేస్తున్నారు. ‘మా ఊరి పొలిమేర 2’పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకు తగ్గంటూగానే సినిమా కూడా ఉంటుందని మేకర్స్‌ అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story