maa association : మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో మరో రసవత్తర పోరు

maa association : మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో మరో రసవత్తర పోరు
maa association : మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమయ్యింది. గత మూడు టర్మ్‌లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో మా ఎన్నికలు వివాదాస్పదం అయ్యాయి.

maa association : మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమయ్యింది. గత మూడు టర్మ్‌లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో మా ఎన్నికలు వివాదాస్పదం అయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు నటుడు ప్రకాశ్‌రాజ్‌. మరో పక్క ఆయనకు పోటీగా మంచు విష్ణు బరిలో దిగుతున్నట్లు సోమవారం సాయంత్రం ప్రకటించారు. దీంతో ఎవరి ప్యానల్‌లో ఎవరు ఉంటారు? ఎవరికి ఎవరు మద్దతుగా నిలుస్తారు అన్నది ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

చిరంజీవి సోదరుడు నాగబాబు మద్దతు ప్రకాశ్‌కు ఉంటుందని ఆయన ఇటీవల ప్రకటించారు. అలాగే చిరంజీవి సపోర్ట్‌ కూడా ఉంటుందని ప్రకాశ్‌రాజ్‌ విశ్వసిస్తున్నారు. తెలుగు పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి తనకు ఓ అవగాహన ఉందని, వాటిని సరిచేయడానికి పక్కా ప్రణాళిక తన దగ్గర ఉందని ప్రకాశ్‌ రాజ్‌ అంటున్నారు. 'మా' నూతన భవన నిర్మాణం కూడా చేస్తానని హామీ ఇచ్చారు. నటులను ఓ తాటిపైకి తీసుకొచ్చి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.

ఐతే.. సోమవారం ఉదయం మోహన్‌బాబు, విష్ణు సూపర్‌స్టార్‌ కృష్ణను కలవడం... సాయంత్రానికి విష్ణు 'మా' అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించడం జరిగిపోయింది. విష్ణు బలం తన తండ్రి మోహన్‌బాబు. ఇప్పటికే కృష్ణ మద్దతు విష్ణుకు దక్కిందన్న టాక్ విన్పిస్తోంది‌. ప్రస్తుత 'మా' అధ్యక్షుడు నరేశ్‌ సపోర్ట్‌ కూడా విష్ణుకి దక్కింది. అయితే ఎవరు ఎవరికి మద్థతునిచ్చినా అంతిమంగా మెగా కాంపౌండ్‌ మద్థతు లభించిన వారికే పదవి దక్కుతుందని భావిస్తున్నారు. అయితే మెగాస్టార్‌ సపోర్ట్‌ ఎవరికి అన్నది తెలియాల్సి ఉంది. చిరంజీవి, తన మిత్రుడు మోహన్‌బాబుకు సపోర్ట్‌ చేస్తారా ? లేక సోదరుడిగా భావించే ప్రకాశ్‌రాజ్‌కు మద్దతిస్తారా అన్న చర్చ జరుగుతోంది.

మరోవైపు.. మా ఎన్నికల్లో లోకల్‌ - నాన్‌ లోకల్‌ నినాదం విన్పించే అవకాశాలు కన్పిస్తున్నాయి. విష్ణు లోకల్‌.. ప్రకాశ్‌రాజ్‌ నాన్‌ లోకల్‌. ఈ ఈక్వేషన్‌ ఎంత వరకూ వర్కవుట్‌ అవుతుందో చూడాలి. ఎందుకంటే 'మా' అసోసియేషన్‌ పుట్టినప్పటి నుంచి తెలుగు ఆర్టిస్ట్‌లే అధ్యక్ష పదవిని అలంకరించారు. ఇప్పుడు పరభాష నటుణ్ణి అధ్యక్షుడిగా నిలబడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే చర్చ జరుగుతోంది. ప్రకాష్‌ రాజ్‌కు.. మంచు విష్ణుకు మధ్య రాజకీయపరంగా.. సేవాపరంగా ఎలాంటి బలాలున్నాయి.. బలహీనతలున్నాయనే అంశంపై ఇండస్ట్రీలో అప్పుడే చర్చ ప్రారంభమయ్యింది. మరి ఎవరి ప్లస్సులేంటో.. మైనస్సులేంటో.. మా పట్టం ఎవరికో సెప్టెంబర్‌లో తేలనుంది.

Tags

Read MoreRead Less
Next Story