Maa Elections 2021 Prakash Raj : మా ఎన్నికల నామినేషన్ల పర్వం.. నామినేషన్ వేసిన ప్రకాష్ రాజ్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్-మా ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. మా అధ్యక్ష పదవికి ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉదయం తన ప్యానల్ సభ్యులతో కలిసి ఫిల్మ్ ఛాంబర్ లో నామినేషన్లు వేశారు. ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. మరో సీనియర్ నటుడు సీవీఎల్ నర్సింహారావు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
మంచు విష్ణు ప్యానెల్ రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇవాల్టి నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. సెప్టెంబర్ 30న నామినేషన్లను స్క్రూటినీ చేసి అక్టోబర్ 2న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారి వెల్లడిస్తారు. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరుగుతాయి. అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు.
మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెళ్లు పోటీపడుతున్నాయి. తమ ప్యానెళ్ల తరపున పోటీచేసే సభ్యులను ఇప్పటికే ప్రకటించిన ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు.... ఎన్నికల మ్యానిఫెస్టోలను కూడా విడుదల చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెళ్లు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలతో మా ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com