Mahesh Babu: మింత్రాతో మహేశ్ కొలాబరేషన్

రెండు దశాబ్దాలుగా వెండితెరపై అలరిస్తూ విశేష అభిమానులను సాధించుకున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. అమ్మాయిల కలల రాకుమారునిగా హృదయాల్లో చెరగని స్థానం ఏర్పరుచుకున్న మహేష్ అటు తెరపై ఇటు తెర వెనకాల మల్టీ స్టార్‌గా సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. సినిమా పరంగానే కాకుండా ఆర్థీకంగా కూడా మహేష్ బాబు మంచి నిర్ణయాలే తీసుకుంటాడు. అతడు వ్యాపారపరంగా అడుగులేసే విధానాన్ని చూస్తే తాను ఎంత స్మార్టో తెలుస్తోంది. ఏఎంబీ సినిమాస్‌తో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. ఇప్పుడది చాలా పాపులర్ అయి తనదైన మార్క్ వేసుకుంటూ దూసుకుపోతోంది.
ఆ తరువాత ఇటీవలే ఏఎన్ పాలెస్ హైట్స్ ప్రారంభించి హోటల్ రంగంలోకి కూడా ప్రవేశించాడు. ఇంతకు ముందే బంజారాహిల్స్ రియల్ ఎస్టేట్‌తో కలిసి స్థిరవ్యాపారంలో కూడా రానిస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా ఆన్‌లైన్ మార్కెట్ అయిన మింత్రాతో కొలాబ్రేట్ అవుతూ హంబుల్ కో అనే బ్రాండ్‌తో దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ప్రిన్స్ తాజాగా ప్రారంభించిన హంబుల్ బ్రాండ్ పై వినియోగదారుల నుంచి మంచి స్పందనే వస్తోంది. దీంతో మహేష్ బాబు కేవలం నటనలోనే కాదు, వ్యాపారంలో కూడా చాతుర్యం కలవాడని తెలుస్తోంది. ఇంతటితో ఆగకుండా ముందు ముందు ఇంకేమి చేస్తాడోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు ఆస్తుల వివరాలు చూసుకున్నట్లైతే..2022 లెక్కల ప్రకారం 244 కోట్లు ఉంది. అయితే సూపర్‌స్టార్ ఒక్క సినిమాలో నటిస్తే 40 నుంచి 45 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. ఇదే కాకుండా పలు బ్రాండ్స్ కు బ్రాండ్ ప్రమోటర్‌గా కూడా నటిస్తుంటాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com