Mahesh Babu Birthday: మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్.. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి సూపర్ స్టార్‌లా..

Mahesh Babu Birthday: మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్.. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి సూపర్ స్టార్‌లా..
Mahesh Babu Birthday:మహేష్ బాబు.. రాజకుమారుడులా ఎంట్రీ ఇచ్చి.. మురారిలా మురిపించి.. ఒక్కడుగానే బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు

Mahesh Babu Birthday: సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజకుమారుడులా ఎంట్రీ ఇచ్చి.. మురారిలా మురిపించి.. ఒక్కడుగానే బాక్సాఫీస్ ను షేక్ చేసిన పోకిరి. ఎలాంటి కథైనా ఖలేజా చూపుతూ.. తెలుగు సినిమాకు పక్కా బిజినెస్ మేన్ లా సరికొత్త మార్కెట్ ను ఓపెన్ చేసిన ఓవర్శీస్ స్టార్ అతడు. జయాజయాలతో సంబంధం లేకుండా.. సైనికుడులా కష్టపడుతూ.. అవకాశాన్ని దూకుడు చూపుతూ.. శ్రీమంతుడైనా మహర్షిలా పక్కవారికి సాయం చేస్తూ సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్న ఒన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే ఇవాళ. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కు బర్త్ డే విషెస్ చెప్పేద్దాం

మహేష్ బాబు బార్న్ విత్ సిల్వర్ స్క్రీన్. పెద్దగా కష్టపడకుండానే సినిమాల్లోకి వచ్చాడు. కానీ స్టార్డమ్ మాత్రం అంత ఈజీగా రాలేదు. స్టార్ వార్ లో ఎన్నో హర్డిల్స్ ని దాటుకుని సూపర్ స్టార్ అయ్యాడు. ఫ్లాప్స్ వచ్చినప్పుడు నిరాశ పడుకుండా ఖలేజా ఉన్న కథలతో దూకుడు చూపించి టాప్ లేపేశాడు. సూపర్ స్టార్ తనయుడైనా.. తనూ సూపర్ స్టార్ అనిపించుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ఆ కష్టానికి ఫలితం.. ఇప్పుడు మహేష్ బాబు టాలీవుడ్ నెంబర్ వన్ హీరో. క్లాస్ లోనూ మాస్ లోనూ తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకున్న ఏకైక హీరోగా ఇప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ హీరో పొజిషన్ లో ఉన్నాడు మహేష్ బాబు.

మహేష్ బాబు హిట్టు ఫ్లాపులతో సంబందం లేకుండా సినిమాలు చేస్తున్నాడు గానీ, చాక్లెట్ బాయ్ క్యారెక్టర్స్ తో మాస్ కి ఎక్కడం కష్టం. మాస్ ఆడియన్స్ లో ఫాలోయింగ్ లేకపోతే కృష్ణ వదిలిపెట్టిన ప్లేస్ ని రీప్లేస్ చెయ్యడం కష్టం అని సినీపెద్దలంతా మాట్లాడడం స్టార్ట్ అయ్యింది. మరి మాస్ అంటే ఏంటి? అందరినీ మెప్పించడమే కదా. యస్ ఒక్కడుతో ఆపని పర్ఫెక్ట్ గా చేశాడు మహేష్ బాబు.

హిట్స్ ఉన్నాయి. ఫ్లాప్స్ వచ్చినా అధైర్యపడకుండా దూసుకెళ్తున్నాడు. కానీ మహేష్ బాబు ఇంకేదో సాధించాలి. అభిమానులంతా గర్వపడేలా, స్టార్ వార్ లో దుమ్ముదులిపేలా ఓ హిట్ కావాలి. అది ఫలానా హీరోకి ఫలానా సినిమాఉందే.. అలా అని అంతాఅనుకునేలా ఉండాలి.. అనుకుంటోన్న టైమ్ లో పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన పోకిరి అభిమానుల ఆకలిని తీర్చింది. ఆ టైమ్ కు ఉన్న అన్ని రికార్డులను తిరగరాస్తూ మహేష్ ని టాప్ రేసులో నిలిపింది పోకిరి.

మహేష్ బాబు హీరోయిజాన్ని నమ్ముకుంది తక్కువ. స్టోరీనే నమ్మాడు. తన చుట్టే సినిమా అంతా తిరగాలని అనుకోలేదు. అందుకే వెంకటేష్ తో కలిసి మల్టీస్టారర్ మూవీ సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు చేశాడు. టాలీవుడ్ లో 20ఏళ్ల తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ లో మహేష్ ఇమేజ్ రెండింతలు అయిందంటే అతిశయోక్తేం లేదు. శ్రీమంతుడు తర్వాత భారీ హైప్స్ మధ్య వచ్చిన బ్రహ్మోత్సవం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన స్పైడర్ కూడా అంతే అయింది.

స్పైడర్‌తో ఫస్ట్ టైమ్ కోలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో మరోసారి శ్రీమంతుడు దర్శకుడుతో జోడీ కట్టాడు. వీరి కాంబినేషన్ లో ఉండే మ్యాజిక్ మళ్లీ రిపీట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన భరత్ అనేనేను బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీలో ఫస్ట్ టైమ్ ముఖ్యమంత్రిగా నటించాడు మహేష్. వారసుడుగా వచ్చినా.. స్వయంకృషితో ఎదిగాడు. భారీ కాంపిటీషన్ ఉన్నా.. తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. టాలీవుడ్ కమర్షియల్ మార్కెట్ ను ఓవర్శీస్ వరకూ తీసుకువెళ్లి.. మన సినిమాకు సరికొత్త మార్కెట్ ను అందించడంలో ముందున్న మహేష్ బాబు మరిన్ని మంచి సినిమాలతో మనల్ని అలరించాలని కోరుకుందాం.

Tags

Read MoreRead Less
Next Story