Mahesh Babu: బుల్లితెరపై మహేశ్, సితార.. గెస్ట్ అప్పియరెన్స్ కోసం కోట్ల రెమ్యునరేషన్..

Mahesh Babu: మహేశ్ బాబు సినిమా ఈవెంట్స్‌కు తప్పా పెద్దగా బయటికి రారు. ఇదంతా ప్రేక్షకులకు తెలిసిందే. కానీ ఇప్పుడిప్పుడే మహేశ్.. ప్రేక్షకులకు ఎక్కువగా దగ్గర అవ్వడానికి చూస్తున్నారు. అందుకే ఈవెంట్స్‌లో యాక్టివ్ పాల్గొనడం దగ్గర నుండి సోషల్ మీడియాలో కూడా ఎక్కువ యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా తన కూతురు సితారతో కలిసి బుల్లితెరపై ప్రత్యక్షమయ్యారు మహేశ్. దీనికోసం ఆయన భారీగానే పారితోషికం అందుకున్నట్టు సమాచారం.
మహేశ్ బాబు తన ఫ్యామిలీతో ట్రిప్స్‌కు వెళ్తూ ఉంటారు. కానీ వారితో కలిసి ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయిన సందర్భాలు మాత్రం లేవు. అలాంటిది తన కూతురు సితారతో కలిసి జీ తెలుగులోని ఓ డ్యాన్స్ షో ఓపెనింగ్ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలవ్వకముందే ఫోటోలు లీక్ అవ్వడంతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.
డ్యాన్స్ షోకు వచ్చిన సితార.. అక్కడ ఉన్నవారితో కలిసి స్టెప్పులు కూడా వేసింది. అయితే దీనికోసం మహేశ్ ఏకంగా రూ.9 కోట్లు పారితోషికంగా అందుకున్నారట. కానీ ఈ రెమ్యునరేషన్ అంతా ఒక్క డ్యాన్స్ షో ఎపిసోడ్ కోసం మాత్రమే కాదట. త్వరలోనే జీ తెలుగుకు బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ బాధ్యతలు స్వీకరించనున్నట్టు సమాచారం. ఇకపై సంవత్సరం వరకు జీ తెలుగు అన్ని ఈవెంట్స్‌లో మహేశ్ మెరవనున్నారని ఫిల్మ్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com