టాలీవుడ్

Mahesh Babu: 'త్వరలోనే మిమ్మల్ని కలవాలనుకుంటున్నా'.. డైరెక్టర్‌కు మాటిచ్చిన మహేశ్..

Mahesh Babu: మహేశ్ బాబు తనకు ఏదైనా సినిమా నచ్చితే.. వెంటనే సోషల్ మీడియాలో ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని పోస్ట్ చేస్తారు.

Mahesh Babu: త్వరలోనే మిమ్మల్ని కలవాలనుకుంటున్నా.. డైరెక్టర్‌కు మాటిచ్చిన మహేశ్..
X

Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు తనకు ఏదైనా సినిమా నచ్చితే.. వెంటనే సోషల్ మీడియాలో ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని పోస్ట్ చేస్తారు. అలాగే తాజాగా విక్రమ్ సినిమా చూసిన మహేశ్.. ట్విటర్‌లో తన ఫీలింగ్‌ను పంచుకున్నారు. గత కొన్నిరోజులుగా ఫ్యామిలీతో హాలిడేలో ఉన్న మహేశ్.. విక్రమ్ చిత్రాన్ని కాస్త ఆలస్యంగా చూసి.. మూవీ టీమ్‌ను ప్రశంసించారు.

'విక్రమ్.. ఒక బ్లాక్‌బస్టర్ సినిమా. మిమ్మల్ని త్వరలోనే కలిసి, విక్రమ్ గురించి పూర్తిగా చర్చించాలి అనుకుంటున్నాను లోకేశ్. చాలా అద్భుతమైన సినిమా' అని దర్శకుడు లోకేశ్‌ను ప్రశంసించడంతో పాటు త్వరలోనే కలుద్దామని కూడా మాటిచ్చారు. 'విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ నటన అదిరిపోయింది. ఇంతకంటే బెటర్ యాక్టింగ్ ఉండదేమో. మ్యూజిక్ చాలా బాగుంది అనిరుధ్. బహుశా ఇదే నీ బెస్ట్. ఇది నా ప్లేలిస్ట్‌లో చాలాకాలం టాప్ ప్లేస్‌లో ఉంటుంది' అని ప్రశంసించారు మహేశ్.

'చివరిగా లెజెండ్ కమల్ హాసన్ గురించి.. మీ యాక్టింగ్ గురించి మాట్లాడే అంత క్వాలిఫై అవ్వలేదు నేను. మీ అతిపెద్ద అభిమానిగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే.. ఇది నాకు చాలా గర్వంగా అనిపించే విషయం. మీకు, మీ టీమ్‌కు కంగ్రాట్స్ సార్' అని విక్రమ్ మూవీ సక్సె్స్‌కు ముఖ్య పాత్ర పోషించిన అందరినీ ప్రశంసించారు మహేశ్ బాబు.


Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES