Mahesh Babu: ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన మహేశ్.. హఠాత్తుగా స్టేజ్ ఎక్కి స్టెప్పులు..

Mahesh Babu: పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ నటించిన 'సర్కారు వారి పాట' బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ముందుగా ఈ సినిమాకు కొందరు నెగిటివ్ టాక్‌ను స్ప్రెడ్ చేసినా.. అదేది సినిమా కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ చూపించలేదు. మహేశ్ మాస్ ఎలిమెంట్స్ కోసమైనా సినిమా చూడొచ్చు అనడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దీనికి క్యూ కట్టారు. అందుకే మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది.
మామూలుగా మహేశ్ బాబు బయట ఎక్కువగా మాట్లాడడు. తన సినిమాలకు సంబంధించిన ఇంటర్వ్యూలలో తప్ప బయట ఎక్కువగా కనిపించడు. అయితే సర్కారు వారి పాట సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మాత్రం ఫ్యాన్స్‌కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు మహేశ్. హఠాత్తుగా స్టేజ్‌పైకి వెళ్లి సినిమాలో వైరల్ అయిన ఓ స్టెప్‌ను డ్యాన్సర్స్‌తో, తమన్‌తో కలిసి చేశాడు.
సర్కారు వారి పాటలో అన్ని పాటలకంటే ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది మ.. మ.. మహేశా పాట. మాస్ సాంగ్.. అందులో మహేశ్, కీర్తి సురేశ్ అదిరిపోయే స్టెప్పులు.. ఇవన్నీ కలిపి ఫ్యాన్స్‌కు ఫుల్ ఫీస్ట్‌ను ఇచ్చాయి. అయితే మ.. మ.. మహేశా స్టెప్పును సక్సెస్ సెలబ్రేషన్స్‌లో స్టేజ్‌పై చేసి ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేశాడు మహేశ్ బాబు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#MamaMahesha Song 💥🔥 Dance with #MaheshBabu @MusicThaman Sir.....!!💥💥🕺🕺#SarkaruVaariPaata#BlockbusterSVP 💥 pic.twitter.com/MyZxYytMjb
— SruthiSings (@TeamSruthiSings) May 16, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com