మా కుటుంబంలోకి మరో ఇద్దరు..: నమ్రత శిరోద్కర్
సూపర్ స్టార్ మహేష్ బాబుని సరిలేరు నీకెవ్వరు అంటున్నారు ఆయన అభిమానులు. తెరమీది ఆయన పాత్రల్లో స్వభావం మాదిరిగా నిజజీవితంలోనూ ఆపన్నులను ఆదుకుంటూ అందరివాడనిపించుకుంటున్నారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు శస్త్ర చికిత్స చేయిస్తున్న మహేష్ చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
ఇప్పటికే ఏకంగా 1,020 మంది పిల్లలకు హార్ట్ సర్జరీలు చేయించిన ఆయన తాజాగా మరో ఇద్దరికి ఊపిరి పోశారు. ఈ విషయాన్ని ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చిన్నారులు పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలియజేస్తూ వారి ఫోటోలను షేర్ చేశారు.
మరో రెండు గుండెలు మా కుటుంబంతో కలిశాయి. ఇటీవల హార్ట్ సర్జరీ చేయించుకున్న ఇద్దరు చిన్నారులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలియజేయడానికి సంతోషపడుతున్నాం. క్లిష్ట సమయాల్లో కూడా ఉత్తమ ఆరోగ్య సేవలు అందించినందుకు ఆంధ్రా హాస్పిటల్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు అని నమ్రత పేర్కొన్నారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో మహేష్ అభిమానులు.. అందుకే మహేష్ అంటే మాకంత ఇష్టం.. మా హీరో రీలో హీరో కాదు.. రియల్ హీరో అంటూ మహేష్‌ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
View this post on InstagramA post shared by Namrata Shirodkar (@namratashirodkar) on
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com