టాలీవుడ్

మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. తెరపైకి 'ఒక్కడు' సీక్వెల్!

మహేశ్ బాబు, భూమిక చావ్లా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఒక్కడు.. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఎంఎస్ రాజు నిర్మించారు

మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. తెరపైకి ఒక్కడు సీక్వెల్!
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, భూమిక చావ్లా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఒక్కడు.. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఎంఎస్ రాజు నిర్మించారు. 2003లో సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది. అప్పటివరకు క్లాస్ లుక్స్ తో ఆకట్టుకున్న మహేష్.. ఈ సినిమాతోనే మాస్‌ అభిమానులకు చేరువయ్యాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది.

అవును.. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు నిర్మాత ఎంఎస్ రాజు. తాజాగా అయన తెరకెక్కించిన డర్టీ హరి మంచి విజయం సాధించడంతో.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అభిమానులతో ముచ్చటిస్తూ.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్వరలోనే ఓ సినిమా చేస్తానని ప్రకటించారు. అయితే అది ఒక్కడుకి సీక్వెలేనా అని అభిమానులు ఆయనని ప్రశ్నించారు.

ప్రస్తుతం తాను కథను సిద్ధం చేస్తున్నానని.. అన్నీ ఓకే అయ్యాక వచ్చే నెలలో ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని ఎంఎస్ రాజు వెల్లడించారు. ఒకవేళ ఒక్కడు సినిమాకి సీక్వెల్ చేస్తే దానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తాడని స్పష్టం చేశారు. అటు మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు.

Next Story

RELATED STORIES