యమ స్టైలిష్‌గా మహేష్ .. 'సర్కారువారి పాట' ఫస్ట్ నోటీస్ వచ్చేసింది!

టాలీవుడ్ సూపర్‌స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్‌ప్రైజ్ రానే వచ్చింది. మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారువారి పాట' నుంచి 'ఫస్ట్ నోటీస్' అంటూ మహేష్ లుక్‌ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఈ లుక్‌లో మహేశ్ అదిరిపోయాడు. పోకిరి, అతిధి చిత్రాల తర్వాత పొడవాటి జుట్టుతో మహేష్ కనిపిస్తున్నాడు. అంతేకాకుండా మెడపై రూపాయి కాయిన్ టాటూతో, ఎరుపు రంగు కారులోని నుంచి మహేశ్ స్టైలిష్ గా దిగుతున్నట్టుగా లుక్ ఉంది. కారు వెనుక బైక్‌లపై రేసర్లు కనిపిస్తున్నారు. ఈ లుక్‌ని చూసిన మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. పరుశురాం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com