Mahesh Babu: రాజమౌళితో సినిమాపై స్పందించిన మహేశ్..

Mahesh Babu: రాజమౌళితో సినిమాపై స్పందించిన మహేశ్..
Mahesh Babu: రాజమౌళితో సినిమా చేయడం కల నెరవేరడం లాగా అనిపిస్తుందన్నాడు మహేశ్.

Mahesh Babu: దర్శక ధీరుడు రాజమౌళి పర్ఫెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ సీన్, ప్రతీ షాట్ పర్ఫెక్ట్‌గా రావడం కోసం రాజమౌళి ఎన్ని రోజులైనా అదే షూట్ చేస్తారు. అలాంటి రాజమౌళి.. మహేశ్‌తో సినిమా చేస్తున్నానంటూ ప్రకటించాడు. వీరి కాంబినేషన్‌లో మొదటి సినిమా కాబట్టి ఇప్పటికే అభిమానుల అంచనాలు ఆకాశన్నంటాయి. ఇంతలో ఈ మూవీ గురించి మహేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మహేశ్ బాబు ఏడాదికి రెండు సినిమాలు లేదా కనీసం ఒక్క సినిమాతో అయినా అభిమానులను అలరించడానికి ప్రయత్నిస్తారు. కానీ రాజమౌళి అలా కాదు లేట్ అయినా కూడా అన్ని పర్ఫెక్ట్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా సెట్ అవుతుందా? సెట్ అయితే దాని కథ ఎలా ఉంటుంది? ఇలా అభిమానుల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. దానికి మహేశ్ సమాధానం ఇచ్చాడు.

రాజమౌళితో సినిమా చేయడం కల నెరవేరడం లాగా అనిపిస్తుందన్నాడు మహేశ్. ఆయనతో సినిమా చేయడం అంటే 25 సినిమాలు ఒకేసారి ఒప్పుకున్నట్టు అని చెప్పాడు. 'నా నుండి ఈ సినిమా చాలా కోరుకుంటుంది. దానికోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇది ఒక పాన్ ఇండియా చిత్రం. ఎన్నో సరిహద్దులు దాటి దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల దగ్గరికి ఈ సినిమా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాను' అని తెలిపాడు మహేశ్ బాబు.

Tags

Read MoreRead Less
Next Story