Mahesh Babu : దటీజ్ మహేష్ బాబు.. బుర్రిపాలెంలో వ్యాక్సిన్ పంపిణీ..!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి కృష్ణ సొంత గ్రామం అయిన బుర్రిపాలెంను దత్తత తీసుకొని సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. నేడు కృష్ణ పుట్టిన సందర్భంగా.. బుర్రిపాలెం ప్రజల కోసం కోవిడ్ -19 టీకా డ్రైవ్‌ను నిర్వహించాడు. ఈ విషయాన్నీ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో ఈ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోందని తెలిపాడు.
"బుర్రిపాలెం ప్రజలు టీకా వేసుకుని సురక్షితంగా ఉండాలని నేను చేస్తున్న చిన్న ప్రయత్నమిది. ఈ టీకా డ్రైవ్ ఏర్పాటుకు సహకరించిన ఆంధ్రా హాస్పిటల్స్‌కు, క్లిష్ట కాలంలో స్వచ్చందంగా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించిన టీమ్ మహేశ్‌బాబు సభ్యులకు ప్రత్యేక అభినందనలు" అని మహేష్ తెలిపారు.
ఇక మహేష్.. బుర్రిపాలెంతో పాటుగా తెలంగాణలోని సిద్దాపురం అనే గ్రామాన్ని కూడా దత్తత తీసుకొని సేవలను అందిస్తున్నాడు. కాగా ప్రస్తుతం మహేష్.. పరుశురాం దర్శకత్వంలో సర్కారీ వారి పాట అనే సినిమాని చేస్తున్నాడు.
Vaccination is our ray of hope for a normal life again! Doing my bit to ensure everyone in Burripalem is vaccinated and safe. Extremely grateful to #AndhraHospitals for helping us arrange this vaccination drive. pic.twitter.com/n4CXbzrN9X
— Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com