Mahesh Babu: 18 ఏళ్ల తర్వాత మరోసారి అలా కనిపించనున్న మహేశ్ బాబు..

Mahesh Babu: టాలీవుడ్ హీరోల్లో హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఎక్కువగా ప్రయోగాలు చేయడానికి ఇష్టపడే వారిలో మహేశ్ బాబు కూడా ఒకరు. కానీ ఫ్యాన్స్ మాత్రం మహేశ్‌ను ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో చూడడానికే ఇష్టపడతారు. అందుకే మహేశ్ కూడా కొంతకాలంగా ప్రయోగాలకు దూరంగా ఉంటున్నాడు. కానీ త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా మాత్రం వినూత్నంగానే ఉంటుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ చేసింది రెండు సినిమాలే. కానీ ఈ కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో చాలా క్రేజ్ ఉంది. అయితే ఈ రెండు సినిమా చాలా డిఫరెంట్ కథలతో తెరకెక్కినవే. ఒకదానిలో మహేశ్‌ను క్రిమినల్‌గా చూపిస్తే.. మరో సినిమాలో హీరోలోని కామెడీ యాంగిల్‌ను పూర్తిస్థాయిలో బయటపెట్టాడు. అలాగే ఈసారి కూడా త్రివిక్రమ్ ఏదో మ్యాజిక్ చేయనున్నాడని అభిమానులు అనుకుంటున్నారు.
ఇప్పటివరకు మహేశ్ 28వ చిత్రం నుండి సమాచారం పెద్దగా బయటికి రాలేదు. ఇది ఏ జోనర్ సినిమా, కథ ఎలా ఉంటుంది అని ఏ సమాచారం తెలియదు. కానీ తాజాగా ఓ క్రేజీ న్యూస్ టాలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. మహేశ్.. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేయనున్నాడట.
ఇప్పటివరకు మహేశ్ ఏ సినిమాలోనూ పూర్తిస్థాయిలో డ్యూయల్ రోల్‌లో నటించలేదు. 2004లో విడుదలయిన 'నాని ' చిత్రంలోనే మహేశ్ తండ్రిగా, కొడుకుగా కాసేపు ద్విపాత్రాభినయం చేశాడు. ఇక 18 ఏళ్ల తర్వాత మరోసారి అలాంటి క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు మహేశ్. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే మహేశ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ అనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com