Mahesh Babu: తన సూపర్ ఫ్యాన్స్‌కు మహేశ్ బాబు స్పెషల్ మెసేజ్..

Mahesh Babu: స్టార్ హీరోలు తమ అభిమానులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అందుకే వారి ఫ్యాన్ బేస్ పెరుగుతుందే తప్ప తగ్గదు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఒకరు. తన ఫ్యాన్స్ కోరుకున్నట్టుగానే చాలాకాలం తర్వాత మాస్ ఎలిమెంట్స్‌తో 'సర్కారు వారి పాట'ను తీశాడు మహేశ్. అందుకే ఫ్యాన్స్ ఈ సినిమాను సూపర్ సక్సెస్ చేశారు. ఇక తన ఫ్యాన్స్ కోసం స్పెషల్‌గా ఓ ట్వీట్ చేశాడు మహేశ్ బాబు.
పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ నటించిన సర్కారు వారి పాటలో హీరోయిన్‌గా కీర్తి సురేశ్ అలరించింది. ఇక మహేశ్, కీర్తి జోడీకి కూడా మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా మ.. మ.. మహేశా పాట ఫ్యాన్స్‌తో స్టెప్పులేయించింది. అయితే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో కూడా మహేశ్ ఈ పాటకు స్టేజ్‌పైకి వచ్చి స్టెప్పేయడం ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది.
సర్కారు వారి పాట సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఇదంతా మీకోసమే అంటూ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడాడు మహేశ్. ఇక మరోసారి వారికోసమే స్పెషల్‌గా ఓ ట్వీట్ చేశాడు. 'సర్కారు వారి పాటపై మీరు చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ సక్సెస్ చేసినందుకు నా సూపర్ ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు.' అని ట్వీట్ చేశాడు మహేశ్ బాబు.
Overwhelmed by the outpouring of love for #SarkaruVaariPaata! To all my super fans, a heartfelt thank you for making this film a blockbuster success! Gratitude always 🙏🙏🙏 pic.twitter.com/4kN8FzZFlE
— Mahesh Babu (@urstrulyMahesh) May 18, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com