టాలీవుడ్

Box Office Clash : వచ్చే సంక్రాంతికి మహేష్ vs పవన్.. !

వచ్చే సంక్రాంతికి మహేష్, పవన్ సినిమాలు రిలీజ్ అవుతుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏంటంటే..

Box Office Clash : వచ్చే సంక్రాంతికి మహేష్ vs పవన్..  !
X

సెకండ్ ఇన్నింగ్స్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వరుసపెట్టి సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే పవన్ రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ ముగించుకొని విడుదలకి సిద్దం కాబోతుంది.. ఈ సినిమాని ఏప్రిల్ 9న విడుద‌ల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా తర్వాత పవన్.. క్రిష్ మూవీ డైరెక్షన్ లో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని.. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లుగా కొద్దిసేపటి క్రితమే మేకర్స్ ప్రకటించారు. కాగా ఇప్పటికే మ‌హేష్ బాబు హీరోగా నటిస్తున్న స‌ర్కారు వారి పాట చిత్రాన్ని సంక్రాంతికి విడుద‌ల చేయనున్నట్లుగా చిత్రబృందం ప్రకటించింది. వచ్చే సంక్రాంతికి మహేష్, పవన్ సినిమాలు రిలీజ్ అవుతుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పవన్, మహేష్ లకి ఇవి 27 వ చిత్రాలు కావడం!


Next Story

RELATED STORIES