లేడీ డైరెక్టర్‌తో మహేష్ కొత్త ప్రాజెక్ట్..

లేడీ డైరెక్టర్‌తో మహేష్ కొత్త ప్రాజెక్ట్..
X
మహేష్‌కి ఆ సినిమా బాగా నచ్చడంతో సుధ డైరెక్షన్‌లో సినిమా చేయాలనుకుంటున్నారట.

ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చేస్తున్న మహేష్ తన తదుపరి చిత్రాన్ని లేడీ డైరెక్షన్‌లో చేయాలనుకుంటున్నారట. తమిళ చిత్రాల ద్వారా చిత్ర సీమలోకి అడుగుపెట్టిన సుధ కొంగర .. ఆ మధ్య ఓటీటీలో విడుదలై సంచలనం సృష్టించిన ఆకాశమే నీ హద్దురా చిత్రానికి డైరెక్టర్. ఆ సినిమా ప్రేక్షకాదరణతో పాటు చిత్రసీమలోని పలువురి ప్రముఖుల ప్రశంసలందుకుంది. మహేష్‌కి ఆ సినిమా బాగా నచ్చడంతో సుధ డైరెక్షన్‌లో సినిమా చేయాలనుకుంటున్నారట. ఇక సుధ కూడా మహేష్ కోసం ఓ మంచి కధను తయారు చేశారట. సర్కారు వారి పాట పూర్తయిన అనంతరం సుధ డైరక్షన్లో సినిమా చేస్తారు. రాజమౌళితో కూడా ఓ సినిమా చేయడానికి ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి.

Tags

Next Story