Major: 'మేజర్' మూవీ టీమ్ సూపర్ ప్లాన్.. ఫస్ట్ టైమ్ ఇలా..

Major: సినిమాను ప్రమోట్ చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. ఇలా కూడా చేయవచ్చా అని ఆశ్చర్యపరుస్తుంటారు. ప్రస్తుతం మేజర్ మూవీ టీమ్ కూడా అలాగే చేస్తోంది. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎవరికీ రాని ఓ వినూత్న ఆలోచనతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
అడవి శేష్, సయ్యి మంజ్రేకర్ హీరోహీరోయిన్లుగా ముంబాయి దాడుల్లో ప్రాణాలు అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమే 'మేజర్'. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మిస్తున్నాడు. జూన్ 3న మేజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదలకు 10 రోజుల ముందే అంటే మే 24 నుండే మేజర్ ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి.
దేశంలో ప్రధాన నగరాలైన పూణే, ముంబై, బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్, అహ్మదాబాద్, జైపూర్, ఢిల్లీ, లక్నోలో మేజర్ ప్రీమియర్ షోలను మే 24 నుండే ప్రారంభించనుంది బుక్ మై షో. ఈ 10 రోజుల్లో ఒక్కో నగరంలో ఒక్కో చోట ప్రీమియర్ షో రన్ అవుతుంది. ఈ విషయాన్ని అడవి శేష్ తన ట్విటర్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేశాడు. దీంతో మేజర్ సినిమాకు ఓ రేంజ్‌లో ప్రమోషన్ ప్రారంభమయ్యింది.
HERE it is!!! MASSIVE! For the FIRST TIME EVER!#MAJOR
— Adivi Sesh (@AdiviSesh) May 23, 2022
X@bookmyshow pic.twitter.com/so2fTAx4Y6
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com