'మేక్ ఏ విష్ ' : ముగ్గురు మహిళల కధ

మేక్ ఏ విష్  : ముగ్గురు మహిళల కధ
సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

సంధ్య బైరెడ్డి దర్శకత్వంలో, కిరణ్ కస్తూరి నిర్మాతగా వస్తున్న చిత్రం 'మేక్ ఏ విష్ '. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ఏపీ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రసన్నకుమార్, నిర్మాత రామ సత్యనారాయణ రిలీజ్ చేశారు. సినిమా టీం కి తమ అభినందనలు తెలియజేశారు. ముగ్గురు స్త్రీల జీవితాలతో ముడిపడిన కధ ఇది .మాయ సినిమాలో నటిగా టాలీవుడ్ కి పరిచయమైన సంధ్య బి రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.అమెరికాలోని వాషింగ్టన్ డిసి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story