ఈ ఉదయ్‌‌కిరణ్ హీరోయిన్‌‌ గుర్తుందా.. ?

ఈ ఉదయ్‌‌కిరణ్ హీరోయిన్‌‌ గుర్తుందా.. ?
చాలా మంది చైల్డ్‌‌అరిస్ట్‌‌లు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోహీరోయిన్‌ ‌లుగా మారుతుంటారు. తరుణ్, మీనా, రాశి నుంచి మొన్న వచ్చిన తేజ సజ్జ వరకు అలాగే అయినవారే..

చాలా మంది చైల్డ్‌‌అరిస్ట్‌‌లు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోహీరోయిన్‌ ‌లుగా మారుతుంటారు. తరుణ్, మీనా, రాశి నుంచి మొన్న వచ్చిన తేజ సజ్జ వరకు అలాగే అయినవారే.. అయితే ఇందులో చైల్డ్‌‌అరిస్ట్‌‌గా ఫుల్ సక్సెస్ అయిన చాలా మంది.. హీరోహీరోయిన్‌‌గా మాత్రం ఫెడ్‌‌అవుట్ అవుతున్నారు. అలా ఫెడ్‌‌అవుట్ అయిన జాబితాలోకి వస్తుంది సుహాని కలిత.. సుహాని కలిత అంటే టక్కున గుర్తుపట్టడం కష్టమే అనుకోండి.


'మనసంతా నువ్వే' సినిమాలో 'తూనీగ తూనీగ'.. అంటూ కనిపించిన ఆ చైల్డ్‌‌ఆర్టిస్టే ఈ సుహాని కలిత. బాలరామాయణం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుహాని.. ఆ తర్వాత గణేష్‌, ప్రేమంటే ఇదేరా, మనసంతా నువ్వే, ఎలా చెప్పను సినిమాలో చైల్డ్‌‌అరిస్ట్ గా నటించింది. అయితే ఇందులో ఉదయ్‌‌కిరణ్ హీరోగా వచ్చిన మనసంతా నువ్వే ఆమెకి మంచి పేరును తీసుకు వచ్చింది.


ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చిన సుహానీ.. 2008లో బి. జయ దర్శకత్వంలో వచ్చిన సవాల్‌ అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్నేహగీతం, శ్రీశైలం ఇలా దాదాపుగా యాబై సినిమాలలో నటించింది. ఇన్ని సినిమాలలో నటించినప్పటికీ ఆమెకి హీరోయిన్‌‌గా మాత్రం గుర్తింపు రాలేదు. ప్రస్తుతం యాక్టింగ్‌ కెరీర్‌కు దూరంగా ఉన్న ఈమె మంచి కథ దొరికితే హీరోయిన్‌‌గా చేసేందుకు సిద్దంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story