Manchu Lakshmi: మంచు లక్ష్మి అందానికి వారు ఫిదా.. అందుకే ఆ లిస్ట్‌లో చోటు..

Manchu Lakshmi: మంచు లక్ష్మి అందానికి వారు ఫిదా.. అందుకే ఆ లిస్ట్‌లో చోటు..
Manchu Lakshmi: మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది మంచు లక్ష్మి.

Manchu Lakshmi: మంచు వారి ఫ్యామిలీ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం ఏమీ అవసరం లేదు. ముందుగా టాలీవుడ్‌లో హీరోగా అడుగుపెట్టారు మోహన్ బాబు. ఆ తర్వాత తన వారసులను కూడా ఇండస్ట్రీలో ప్రవేశపెట్టాలనుకున్నారు. అలాగే ముందుగా పెద్ద కుమారుడు విష్ణు, ఆ తర్వాత చిన్న కుమారుడు మనోజ్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కుమార్తె మంచు లక్ష్మి వంతు వచ్చింది.

మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది మంచు లక్ష్మి. కానీ ముందుగా హీరోయిన్‌గా కాదు. హోస్ట్‌గా. అప్పటికీ తెలుగులో టాక్ షోలు అంత పాపులర్ కాకపోయినా.. మంచు లక్ష్మి టాక్ షోలను నిర్వహించి ఓ ట్రెండ్‌ను క్రియేట్ చేసింది. ఆ తర్వాత నటిగా మారింది. మెల్లగా తానే నిర్మాతగా సినిమాలను నిర్మించడం కూడా మొదలుపెట్టింది. ఇప్పుడు మంచు లక్ష్మి రికార్డులలోకి మరో నెంబర్ యాడ్ అయ్యింది.

టీసీ కండ్లెర్‌ అనే మ్యాగజైన్‌.. ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందమైన మహిళల్లో 100 మందిని ఎంపిక చేసి ఫీచర్ చేస్తుంది. 1990 నుండి ఈ మ్యాగజిన్ సర్వేను నిర్వహిస్తోంది. ఇక ఈ ఏడాది టాలీవుడ్ నుండి మంచు లక్ష్మి అందమైన మహిళగా సెలక్ట్ అయ్యింది. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. వారికి థాంక్యూ చెప్పుకుంది.


Tags

Read MoreRead Less
Next Story